హైదరాబాద్:
రాష్ట్ర రాజధానిలో కీచక ప్రిన్సిపల్ వ్యవహారం
బయటపడింది. హైదరాబాదులోని అల్వాల్లోని ఓ హోటల్
మేనేజ్మెంట్ కళాశాలలో అమ్మాయిలు
పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. మార్కులు వేయాలన్నా లేదా మేనేజ్మెంట్
పూర్తైన తర్వాత ఉద్యోగం కావాలన్నా అమ్మాయిలు అయితే తనకు ముద్దు
ఇవ్వాలని అబ్బాయిలైతే మందు పార్టీ ఇవ్వాలని
డిమాండ్ చేసేవాడు.
ఆగ్రహం
చెందిన విద్యార్థులు మంగళవారం సదరు మేనేజ్మెంట్
కళాశాలపై దాడి చేశారు. వీవాంట్
జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
కాలేజి పైన దాడి చేశారు.
ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
ప్రిన్సిపల్ను తప్పించాలని విద్యార్థులు
కళాశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులను వేధిస్తున్నాడని వారు ఆరోపించారు.
యాజమాన్యానికి
ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. విద్యార్థులను సముదాయించారు. కాగా ప్రిన్సిపల్ను
విధుల నుండి తప్పించినట్లు యాజమాన్యం
చెబుతోంది. అతనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే తొలగించామని చెప్పారు.
0 comments:
Post a Comment