హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసు
ప్రధాన నిందితుడు భాను కిరణ్తో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికు గల లింకులు బయటపడుతున్నాయని
అంటున్నారు. భాను భూదందాలు, సెటిల్మెంట్ల
సెగ కడపను కూడా తాకింది.
కడప జిల్లాకు చెందిన పలువురితో తనకు సంబంధాలున్నట్లు సిఐడి
విచారణలో భాను వెల్లడించినట్లుగా ఆంధ్రజ్యోతి
దిన పత్రిక కథనం ఇచ్చింది.
దాంతో
ఈ జిల్లాలోని ఇద్దరికి సిఐడి తాఖీదులు పంపిందనీ,
మరో ఇద్దరికి కూడా రేపో మాపో
నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తోందని రాసింది. సిఐడి తాఖీదులు అందుకున్న,
అందుకోనున్న వారికి ఇటు భానుతో పాటు,
అటు జగన్తో సంబంధాలు
ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో ఒకరు దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డికి బంధువు అని తెలుస్తోందని రాసింది.
తాఖీదుల దరిమిలా వీరు రేపో మాపో
సిఐడి ముందు హాజరుకావాల్సి ఉందని
తెలిపింది.
కథనం
ప్రకారం... భాను విచారణలో వెల్లడించిన
సమాచారం మేరకు, కడప జిల్లాలోని ఇద్దరికి
సిఐడి తాఖీదులు పంపిందనీ, మరో ఇద్దరికి కూడా
రేపో మాపో నోటీసులు ఇవ్వనున్నదని
తెలిసింది. నోటీసు అందిన వారు కడపకు
చెందిన మల్లికార్జునరెడ్డి, పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన పోరెడ్డి ప్రభాకర్రెడ్డి కాగా.. నోటీసులు త్వరలో అందుకోనున్నవారు తంగేడుపల్లె శంకర్రెడ్డి, సంబటూరు
వంశీ అని సమాచారం.
ఈ విధంగా సిఐడి తాఖీదులు అందుకున్న,
అందుకోనున్న వారికి ఇటు భానుతోపాటు, అటు
జగన్తో సంబంధాలు ఉన్నాయంటున్నారు.
మల్లికార్జునరెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డికి బంధువు
అని తెలిసింది. తాఖీదుల దరిమిలా వీరు రేపోమాపో సిఐడి
ముందు హాజరుకావాల్సి ఉంది. విశ్వసనీయంగా అందిన
సమాచారం మేరకు భాను బాగోతంలో
పాత్రధారుల వివరాల్లోకెళితే.... వైఎస్ జగన్ బావమరిది ఈసి
దినేశ్రెడ్డి, మామ మనోహర్రెడ్డి
సిటీస్క్వేర్ రియల్ ఎస్టేట్ ఎండిగా
ఉన్నారు.
వీరు
భానుతో కలిసి హైదరాబాద్లోని
మహేశ్వరం మండలంలో ఫ్రంట్లైన్ వెంచర్ వేశారు.
ఇందుకోసం రైతుల నుంచి భూములు సేకరించారు.
ఈ వెంచర్లో అమ్మకాలు కూడా
చేశారు. అయితే రైతులకు మాత్రం
ఇంకా డబ్బులు చెల్లించలేదని సమాచారం. ఇందుకు సంబంధించి కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు
చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తిరుపతిలో
మనోహర్రెడ్డి, భానులు కలిసి బృందావన్ లే
అవుట్లు వేసి వ్యాపారం చేసినట్లు
సిఐడి పోలీసులు గుర్తించారనీ, సిటీ స్క్వేర్లో
సింహాద్రిపురం మండలానికి చెందిన పోరెడ్డి ప్రభాకర్రెడ్డి కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారని తెలుస్తోంది.
ఇవి కాకుండా భాను కడపకు చెందిన
మల్లికార్జునరెడ్డిలు కలిసి మహేశ్వరం మండలం
తుక్కుగూడాలో డాక్యుమెంట్ నెంబర్ 536/2008తో 15 ఎకరాల స్థలాన్ని
తీసుకున్నారని సీఐడీ పోలీసులు గుర్తించారంటున్నారు.
ఇదిలావుంటే, సినీ నిర్మాత సింగనమల
రమేశ్ ప్రొద్దుటూరులోని ఫైనాన్సియర్లకు బకాయిలు ఉన్న విషయం మరొకటి.
ఈ వ్యవహారంలో కమలాపురం ప్రాంతానికి చెందిన తంగేడుపల్లె శంకర్రెడ్డి, సంబటూరు
వంశీలు సింగనమల రమేశ్కు సహకరించినట్లు
సీఐడీకి భాను చెప్పినట్లు తెలిసింది.
వీరిద్దరూ సింగనమల రమేశ్కు చెందిన
ఒక అపార్ట్మెంట్ను తీసుకున్నారట.
0 comments:
Post a Comment