‘అధినాయకుడు’ చిత్రం
విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్లో ‘మంచి నాయకులు
ప్రజల గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల
రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా’ అనే
డైలాగ్ ఉంది. ఈ డైలాగ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు ఉండటంతో ఆ పార్టీ వారు
సినిమాను ఉప ఎన్నికలు ముగిసే
వరకు వాయిదా వేయాలని ఫిర్యాదు చేశారు కూడా.
అసలు
ఈ డైలాగ్ ఎందుకు పెట్టారంటే...
హరిశ్చంద్ర
ప్రసాద్(వృద్ధ గెటప్ బాలయ్య)
లాంటి మంచి నాయకుడు చనిపోవడంతో
అతిని విగ్రహం కర్నూలు నడి ఒడ్డున పెట్టేందుకు
మా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటూ విలన్ కోట
వచ్చి చెబుతాడు. కోట ఈ విగ్రహం
పెట్టే ప్లాన్ ఎందుకు వేస్తాడంటే అతని మనుషులను మచ్చిక
చేసుకోవడానికి. ఇది నచ్చని రామకృష్ణ
ప్రసాద్......‘మంచి నాయకులు ప్రజల
గుండెల్లో ఉండాలేగానీ...రోడ్డుమీద విగ్రహాల్లో కాదు. ఈ విగ్రహాల
రాజకీయం ఎందుకు చేస్తున్నావో చెబుతావా, చెప్పించమంటావా’ అడే
డైలాగ్ కొడతాడు.
పరుచూరి
మురళి దర్శకత్వం వహించిన ‘అధినాయకుడు’ చిత్రాన్ని ఎంఎల్ కుమార్ చౌదరి
కీర్తి కంబైన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ
చిత్రం ఈ రోజు గ్రాండ్గా విడుదలైంది. బాలయ్య
ఈ చిత్రంలో మూడు గెటప్స్ పోషించారు.
హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో అదగరొట్టగా...రామకృష్ణ ప్రసాద్ గెటప్ అతుకుల గడ్డం
సెట్ కాలేదు. కిల్లర్ కిట్టుగా బాలయ్య చేసే డాన్సులు భరించడం
కాస్త కష్టమే.
బాలయ్య
సరసన లక్ష్మిరాయ్ మెయిన్ హీరోయిన్గా నటించింది. లక్ష్మిరాయ్
ఓ పాటలో గెస్ట్రోల్లో
తళుక్కుమంది. ఈ చిత్రానికి కథ:
పరుచూరి మురళి, సంగీతం: కళ్యాణి మాలిక్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.
0 comments:
Post a Comment