హైదరాబాద్:
సిబిఐ కోర్టులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
ఎదురు దెబ్బ తగిలింది. వైయస్
జగన్ బెయిల్ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక
కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో జగన్కు
సిబిఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. సాయంత్రం ఏడు గంటలు దాటిన
తర్వాత సిబిఐ కోర్టు తన
నిర్ణయాన్ని ప్రకటించింది. అప్పటి వరకు సిబిఐ కోర్టు
నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన
తర్వాత నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై సిబిఐ కోర్టు శుక్రవారం
ఆరున్నర గంటలకు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పింది. అయితే, సాయంత్రం ఏడు గంటలు దాటిన
తర్వాత నిర్ణయాన్ని ప్రకటించింది.
తాను
ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున తన అభ్యర్థుల తరఫున
ప్రచారం చేయడానికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైయస్ జగన్ సిబిఐ
కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై
ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
సిబిఐ కోర్టు వాదనలను పరిగణనలోకి తీసుకుని సిబిఐ కోర్టు తన
నిర్ణయాన్ని ప్రకటించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ బయటకు వస్తే
సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని
సిబిఐ వాదించింది.
అలాగే,
వైయస్ జగన్ సిబిఐ కస్టడీ
పిటిషన్పై, ఆయన క్వాష్
పిటిషన్పై శుక్రవారం సాయంత్రం
వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తీర్పును ఎప్పుడు వెలువరించేది తెలియజేయలేదు. దీంతో తీవ్ర ఉత్కంఠ
నెలకొని ఉంది. హైకోర్టుకు వైయస్
జగన్ సతీమణి భారతి, జగతి పబ్లికేషన్స్ వైస్
చైర్మన్ విజయసాయి రెడ్డి హైకోర్టుకు వచ్చారు.
జగన్
జ్యుడిషియల్ రిమాండ్ కేవలం 9 రోజులు మాత్రమే ఉందని చెబుతూ జగన్ను విచారణ నిమిత్తం
తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టును కోరింది.
జగన్పై కచ్చితమైన ఆధారాలున్నాయని
సిబిఐ వాదించింది. జగన్ అరెస్టులో ఏ
విధమైన గందరగోళం లేదని చెప్పింది. పెట్టుబడుల
వ్యవహారంపై జగన్ను విచారించాల్సి
ఉందని సిబిఐ చెప్పింది. మోపిదేవిని,
విజయసాయి రెడ్డిలను విచారించినప్పుడు పలు విషయాలు ముందుకు
వచ్చాయని, వాటిపై జగన్ను విచారించాల్సి
ఉందని చెప్పింది. మూడు రోజుల పాటు
విచారణలో జగన్ ఏమీ చెప్పలేదని
తెలిపింది.
0 comments:
Post a Comment