ప్రతిరోజూ
రెండు సార్లు ఒక్కొక్కసారి అయిదేసి నిమిషాల చొప్పున దంతాలు శుభ్రం చేయటమంటే బోర్ గా భావిస్తారు.
కాని దంత శుభ్రత ఎంతో
ప్రధానమైంది. మరి ప్రతి రోజూ
రెండు సార్లు నోటిని దంతాలతో సహా శుభ్రం చేయాల్సిందే.
తెల్లని పళ్ళు, గట్టి చిగుళ్ళు, వాసనలేని
నోరు, లేదా పుచ్చపోని పల్ళు
మిమ్మల్ని సంతోషంగాను, ఎంతో ఆత్మవిశ్వాసంతోను వుంచుతాయి.
అయితే, దంతాలు శుభ్రం చేసుకోవాలంటే, బ్రష్ చేయటం ఒకటే
మార్గం అనుకుంటున్నారా? అవసరంలేదు, తెల్లని దంతాలు పొందాలంటే ఇంకా ఇతర మార్గాలున్నాయి.
మంచి టూత్ బ్రష్ లేదా
సాంప్రదాయకంగా మీ వేలితో సైతం
దంతాలు శుభ్రం చేసుకోవచ్చు.
సెలవులకు
బయటకు వెళ్ళినా లేదా ఎక్కికైనా చిన్న
టూర్ వేసినా ఒక్కోసారి మీరు టూత్ బ్రష్
మరచిపోతారు. అటువంటపుడు మీ దంతాలను సహజంగానే
శుభ్రం చేయటానికి కొన్ని ఆహారాలు తినవచ్చు. అంతేకాదు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఘాటైన వాసన
వచ్చే ఆహారాలు తినేసిన తర్వాత నోరు అంతా వాసనగా
వుంటుంది. కనుక అటువంటపుడు, కొన్ని
సహజ ఆహారాలు తిని మీ దంతాలను,
నోటిని శుభ్రం చేసుకోవచ్చు.
మరి దంతాల శుభ్రతకు ఆహారాలు
ఏమిటో చూడండి
బెర్రీలు
- బెర్రీలు సిట్రస్ జాతి పండ్లు. తేలికగా
తినవచ్చు. ఇవి మీ దంతాలను
శుభ్రం చేయటమే కాదు, తెల్లపరుస్తాయి. ప్రత్యేకించి
స్ట్రాబెర్రీలు సహజ టూత్ పేస్ట్
లా పనిచేస్తాయి. కనుక ఒక స్ట్రాబెర్రీ
పండు ముక్క చేసి దానిని
మీ దంతాలపై 5 నిమిషాలు రుద్దండి. దంతాలు తెల్లబడాలంటే, స్ట్రా బెర్రీలు గుజ్జు, బేకింగ్ సోడా కలిపి రుద్దండి.
మీ దంతాలు తెల్లగా, మెరిసిపోతూ వుంటాయి.
ఆపిల్
- సాధారణంగా మనం కర కరలాడే,
కేరట్లు, బ్రక్కోలి, ఆపిల్, మొదలైనవి దంతాలను, చిగుళ్ళను శుభ్రం చేస్తాయనుకుంటాం. అయితే యాపిల్ పండులో
వుండే, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు
బాక్టీరియాను చంపేసి, నోరు వాసన రాకుండాను
దంతాలను మెరిసేలాను, చేస్తాయి. నోటి శుభ్రత బాగా
పాటించాలంటే, ప్రతిరోజూ ఒక యాపిల్ తినేయండి.
నిమ్మ
పండు - సిట్రిక్ యాసిడ్ కల నిమ్మకాయ దంతాలను
బాగా శుభ్రం చేస్తుంది. నిమ్మ ముక్కను నేరుగా
దంతాలపై పెట్టి శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేయటమే కాదు, నిమ్మరసం నోటిలోని
బాక్టీరియాను తొలగించి, నోరు దుర్వాసన రాకుండా,
దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. నిమ్మ రసాన్ని దంతాల
శుభ్రతకు ప్రాచీన కాలంనుండి వాడుతూనే వున్నారు. నిమ్మ రసానికి కొద్దిగా
ఉప్పు వేసి దంతాలనను ప్రతిరోజూ
రుద్దవచ్చు. నోటిని నీటితో కడిగి ఈ రకంగా
అయిదు నిమిషాలు బ్రష్ చేస్తే మంచి
ఫలితాలుంటాయి. దంతాలు బలపడతాయి మరియు తెల్లగా వుంటాయి.
ఛీజ్
- జున్ను ముక్కలు కూడా ఉపయోగించి సహజంగా
దంతాలను శుభ్రం చేయవచ్చు. దీనిలో వుండే యాసిడ్లు పళ్ళ
సందులలో ఇరుక్కున్న ఆహారాలను సైతం తొలగిస్తాయి. నోటిలోని
పి హెచ్ బ్యాలన్స్ నిలుపుతాయి.
జున్ను ఎపుడు తిన్నా మీరు
నోటిలో కొంత లాలాజలాన్ని ఊరించి
తినండి. ఈ లాలాజలం జున్నుకు
రుచి కల్పించటమే కాదు, నోటి శుభ్రతకు
బాగా ఉపయోగిస్తుంది. దంతాల పై భాగాన్ని
శుభ్రం చేస్తుంది. కనుక జున్ను మీకు
ఇప్పటిదాకా మంచిది కాదని భావిస్తే, ఇకపై
తప్పక తినేయండి. దాని ప్రయోజనం పొందండి.
పైన తెలిపిన సహజ ఆహారాలు తింటూ
మీ దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
0 comments:
Post a Comment