రోజు
మొత్తంలో బ్రేక్ ఫాస్ట్ ప్రధానమైన ఆహారం. కాని చాలామంది వివిధ
కారణాలుగా దానిని మానేస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో గింజ ఆహారాలు
ఆరోగ్యకరం. వీటిలో విటమిన్లు, పీచు, లవణాలు పుష్కలంగా
వుంటాయి. కొవ్వు, కేలరీలు తక్కువగా వుంటాయి. పీచు అధికంగా వుండే
గింజ ధాన్యాలు బ్రేక్ ఫాస్ట్ కు మంచి ఆహారం.
ఓట్లు, గోధుమ, బ్రౌన్ రైస్ వంటివి ఎంతో
బాగుంటాయి. మరి బ్రేక్ ఫాస్ట్
లో మీరు చేర్చదగిన ఆహారాలు
ఏమిటో పరిశీలిద్దాం.
గోధుమలు
- గోధుమలలో విటమిన్ ఇ మరియు పీచు
అధికంగా వుంటాయి. గోధుమ ఆహారం రోజంతా
శక్తినిచ్చి మిమ్మల్ని ఉత్సామంగా వుంచుతుంది. వేరే గింజ ఆహారాలతో
పోలిస్తే గోధుమలలో కొవ్వు, చెడు కొలెస్టరాల్ తక్కువ,
తేలికగా జీర్ణం అవుతాయి. గోధుమ అన్నం వంటివి
మీ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తాయి. కనుక మీరు డైటింగ్
చేసేవారైతే, గోధుమ ఆహారం బరువుతగ్గేందుకు
కూడా తోడ్పడుతుంది. శరీరంనుండి మలినాలను విసర్జిస్తుంది.
ఓట్ గింజలు - తీపిపై మక్కువ కలవారికి ఓట్లు ఆహారంగా బాగుంటాయి.
ఆరోగ్యం దానితో పాటు చక్కని తీపికల
ఈ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఆనందం కలిగిస్తుంది. ఓట్లు
కనుక తీపివి దొరకకపోతే ఓట్ మీల్ లో
కొద్దిగా తేనె కలిపితే మరింత
రుచిగా వుంటుంది. ఓట్ ఆహారంలో తాజా
పండ్లు కూడాచేర్చి తినవచ్చు. ఓట్ ఆహారంలో అనేక
విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ వుంటాయి.
బార్లీ
గింజలు - మీరు డయాబెటిక్ రోగి
అయినట్లయితే, బార్లీ గింజల ఆహారం ఎంతో
మేలు చేస్తుంది. ఈజింజలు మీ బ్లడ్ షుగర్
స్ధాయిలను చక్కగా నియంత్రిస్తాయి. వీటిలో ఫైబర్, ఎమినో యాసిడ్లు, యాంటీ
ఆక్సిడెంట్లు, జింక్ అధికంగా వుంటాయి.
ఆరోగ్యమే కాదు కడుపు కూడా
ఈ ఆహారం నింపుతుంది.
గ్రేప్
నట్ సిరియల్ - గోధుమ , బార్లీ గింజలు రెండూ చేర్చి కూడా
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ
మిశ్రమానికి ద్రాక్ష పండు కలిపితే, మంచి
రుచి వస్తుంది. ఒకమారు తినే ఈ ఆహారంలో
షుమారుగా 7 గ్రాముల పీచు, 6 గ్రాములు ప్రొటీన్, మరియు 4 గ్రాముల షుగర్ వుంటుంది. కనుక
విటమిన్ ఢి, ఫోలిక్ యాసిడ్,
పీచు కల ఈ ఆహారం
మిమ్మలని రోజంతా చురుకుగాను, ఆరోగ్యంగాను వుంచుతుంది.
ఈగింజధాన్యాల
ఆహారం మీకు ఆరోరగ్యం కలిగించటమే
కాదు, మంచి రుచిని కూడా
కల్గించి మీ ఉదయంవేళ బ్రేక్
ఫాస్ట్ గా ఏ ఆహారం
తీసుకోవాలనే సమస్యను నివారిస్తాయి. వీటికిమరింతరుచి కలిగించేందుకు మీ కిష్టమైన స్ట్రాబెర్రీలు,
ఆపిల్స్, అరటిపండు, కివి, ద్రాక్ష వంటి
పండ్లు కూడా చేర్చవచ్చు. ఈ
వంటకాలలో షుగర్ కు బదులుగా
తేనె లేదా పండు ఖర్జూరం
కలిపితే, సహజ తీపి వస్తుంది.
0 comments:
Post a Comment