హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతికి శుక్రవారం
చంచల్గూడ జైలు వద్ద
చేదు అనుభవం ఎదురయింది. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్ను
కలిసేందుకు వైయస్ భారతి మధ్యాహ్నం
తన బంధువులతో పాటు వచ్చారు. ఖైదీలతో
ములాఖత్ సమయం ముగియడంతో జైలు
అధికారులు ఆమెను, బంధువులను జగన్ను కలిసేందుకు
అనుమతించలేదు.
తాను
వచ్చే వరకు ములాఖత్ సమయం
అయిపోయిందని, తన భర్తను కలిసేందుకు
తనకు, తన బంధువులకు అనుమతి
ఇవ్వాలని భారతి జైళ్ల శాఖ
డిజి దాస్ను కోరారు.
సమయం మించిపోయినందున అనుమతి ఇవ్వలేమని భారతికి దాస్ చెప్పారని తెలుస్తోంది.
కాగా జైలులో ఉన్న నేరస్తులను కలిసేందుకు
వారంలో రెండుసార్లు మాత్రమే అనుమతి ఇస్తామని జైలు అధికారులు తెలిపారు.
ఈ కారణంగానే ఆమెకు అనుమతి నిరాకరించామని
చెప్పారు.
జగన్తో భేటీకి జైలు
అధికారులు అనుమతించక పోవడంతో భారతి, బంధువులు విషణ్ణ వదనంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా
వైయస్ జగన్ ఆదివారం అరెస్టయిన
విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఆయనను సిబిఐ
అధికారులు కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు జగన్కు 11వ
తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్
విధించింది. దీంతో అతనిని చంచల్గూడ జైలుకు తరలించారు.
కాగా
జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ
కూడా తమ కస్టడీకి అప్పగించాలంటూ
పిటిషన్ దాఖలు చేసింది. క్వాష్,
కస్టడీ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.
సిబిఐ తరఫు న్యాయవాది తన
వాదనలను పూర్తి చేశారు. లంచ్ తర్వాత జగన్
తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. కాగా నాంపల్లి ప్రత్యేక
కోర్టు జగన్ బెయిల్ పిటిషన్
తీర్పును మరికొద్దిసేపట్లో వెలువర్చనుంది.
0 comments:
Post a Comment