న్యూఢిల్లీ:
ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీల్‌లో మాజీ
టెలికమ్ మంత్రి, డిఎంకె నేత దయానిధి మారన్
చిక్కుల్లో పడ్డారు. మలేషియాకు చెందిన సంస్థ మాక్సిస్ ఎయిర్‌సెల్‌ను తీసుకునేందుకు
జరిగిన వ్యవహారంలో దయానిధి మారన్‌కు, ఆయన
సోదరుడు కళానిధి మారన్‌కు రూ.549
కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఆరోపించింది. ఈ మేరకు చార్జిషీట్
దాఖలు చేయడానికి సిద్ధపడుతోంది.
సిబిఐ
అధికారులు ఇటీవల దయానిధి మారన్‌ను విచారించారు. ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీల్ కేసు దర్యాప్తును
దాదాపు పూర్తి చేశారు. దయానిధి మారన్ కుటుంబానికి చెందిన సన్ డైరెక్ట్‌లో
ప్రీమియమ్ షేర్‌ను దక్కించుకోవడానికి
ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆరోపిస్తోంది. మాక్సిస్‌కు టేకోవర్‌కు
వీలు కల్పిస్తూ డిష్‌నెట్ డిఎస్ఎల్
న్యాయబ్దదమైన విజ్ఞప్తిని కూడా అప్పుడు టెలికమ్
మంత్రిగా ఉన్న దయానిధి మారన్
తోసిపుచ్చినట్లు సిబిఐ ఆరోపించింది.
ఎయిర్‌సెల్ మాజీ యజమాని
సి. శివశంకరన్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా
దయానిధి మారన్, కళానిధి మారన్ జోక్యం చేసుకున్నారని
సిబిఐ ఆరోపించింది. ఎయిర్‌సెల్‌ను
తీసుకున్న తర్వాత కూడా మాక్సిస్‌కు
వక్రమార్గాల్లో ప్రయోజనం చేకూర్చినట్లు ఆరోపించింది.
సిబిఐ
నివేదికపై మాట్లాడడానికి దయానిధి మారన్ నిరాకరించారు. పార్లమెంటుకు
నివేదిక సమర్పించినప్పుడు మాత్రమే తాను మాట్లాడగలనని ఆయన
అన్నారు. టెలికమ్ కుంభకోణంలో తన పేరు రావడంతో
ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రిగా
రాజీనామా చేశారు. సిబిఐ తాజా ఆరోపణలు
డిఎంకె అధినేత కరుణానిధి మారన్‌ను మరింతగా
చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment