అల్లు అర్జున్,
ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జులాయి'. ఈ చిత్రాన్ని
జులై 13న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడిన సంగతి
తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని మరో వారం రోజులు వాయిదా
వేసి జులై 20న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో
దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
‘ఈగ'
చిత్రం నిన్న విడుదలై సూపర్
హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో
ఈగ జోరు తగ్గే వరకు
ఆగితేనే మంచిదని నిర్మాతలు భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరో
వైపు 13వ తేదీనే తమిళ
హీరో అజిత్ నటించిన ‘డేవిడ్
బిల్లా' చిత్రం భారీ అంచనాలతో విడుదలవుతోంది.
ఇది కూడా ‘జులాయి' చిత్రం
వాయిదాకు కారణం అని అంటున్నారు.
త్రివిక్రమ్
శ్రీనివాస్ దర్శకత్వంలో కె. రాధకృష్ణ నిర్మాతగా
హారిక అండ్ హాసిని క్రియేషన్స్
బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత
డివివి. దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో
ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో
విడుదలైన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్:
ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక
అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ,
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం:
త్రివిక్రమ్ శ్రీనివాస్.
0 comments:
Post a Comment