హైదరాబాద్:
‘మంచి కథ దొరికితే ఇతర
హీరోలతో కలసి నటించడానికి నాకు
ఎలాంటి అభ్యంతరాలు లేవు. ‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా'లో నా పాత్ర
కొత్తగా, హుందాగా ఉందని అభిమానులు, శ్రేయోభిలాషులు
చెబుతున్నారు. ఇకపై ఇలాంటి వైవిధ్యభరిత
సినిమాలు చేయడానికి ఈ సినిమా నాకు
స్ఫూర్తిగా నిలిచింది. మంచి కథ దొరికితే
ఇలాంటి పాత్రలు వేరే హీరోల సినిమాల్లో
కూడా చేయడానికి నేను సిద్ధం. అది
అవతలివారు కూడా ఒప్పుకుంటే'' అని
బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షాసేథ్
కాంబినేషన్‌లో శేఖర్‌రాజా
దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన
‘ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' చిత్రం గతవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ
సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో బాలకృష్ణ స్వయంగా పాల్గొన్నారు.
"అలాగే
'ప్రేక్షకులపై ఉన్న నమ్మకంతో ఖర్చుకు
ఏ మాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు
లక్ష్మీప్రసన్న. ఇప్పుడు సినిమాకి లభిస్తున్న ఆదరణ మా అందరికీ
ఎంతో సంతోషాన్నిస్తోంది. పేరునుబట్టి సినిమాను రకరకాలుగా వూహించుకొన్నారు. నా పాత్రకు కూడా
మంచి స్పందన లభిస్తోంది. 'హుందాతనంతో కూడిన ఓ కొత్త
రకమైన పాత్ర చేశార'ని
పలువురు మెచ్చుకొన్నారు. లక్ష్మి నటన కూడా అద్భుతంగా
ఉంది. మోహన్‌బాబు నట
వారసత్వం ఆమెకు కూడా లభించింది.
మనోజ్ పలు హావభావాలు పలికించాడు.
పాత్రకు తగ్గట్టుగానే తనే స్వయంగా పోరాటాలు
సమకూర్చారు. ఈ విజయం సమష్టి
కృషి ఫలితం. ''అన్నారు బాలకృష్ణ.
ఇక
‘‘ఈ సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
ఊహించని దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటివి ఆదరిస్తే మరిన్ని కొత్త తరహా సినిమాలొస్తాయి.
సినిమాలో నా పాత్ర చూసి
అందరూ ఉలిక్కిపడ్డారు. ఎంతో ధైర్యంతో ఈ
సినిమా నిర్మించిన చెల్లెలు లక్ష్మీప్రసన్నను అభినందిస్తున్నాను. నా గెటప్ విషయంలో
తను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇక మనోజ్ అభినయంలోనూ,
పోరాటాల రూపకల్పనలోనూ మంచి ఎనర్జీ చూపించాడు.
ఇంత మంచి సినిమాకు పైరసీ
సమస్య వచ్చిపడింది. పరిశ్రమకు పట్టిన పెనుభూతంలాంటిది పైరసీ. అందరూ పూనుకుంటేగానీ ఇది''
అని బాలకృష్ణ అన్నారు.
మంచు
మనోజ్ మాట్లాడుతూ ''బాలకృష్ణ అన్నయ్య లేకపోతే ఇంత పెద్ద విజయం
దక్కేది కాదు. సినిమాలో ఆయన
పాత్రని చూసినప్పుడు స్వయంగా రాజు వచ్చి నటించినట్టే
అనిపించింద''న్నారు. ''సినిమా విడుదలై మూడు రోజులైంది. మేం
వూహించినదానికంటే ఎక్కువ వసూళ్లు లభిస్తున్నాయి. మాపై నమ్మకంతో ఈ
చిత్రంలో నటించిన బాలకృష్ణ అన్నయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల''న్నారు లక్ష్మీప్రసన్న. ''నా కెరీర్‌లో
నాకు దక్కిన ఓ గొప్ప అవకాశమిది.
ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తుండడం ఆనందంగా ఉంది''అన్నారు దీక్షాసేథ్.
0 comments:
Post a Comment