దివంగత
నేత వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తున్నట్లే ఉంది.
కీలకమైన సమయంలో తనను కాదని, కాంగ్రెసు
వైపు వెళ్లిన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కరుణించడానికి
సిద్ధంగా లేనట్లు అర్థమవుతోంది. మరోసారి శనివారం వైయస్ వివేకానంద రెడ్డి
జగన్‌ను కలవడానికి ముప్పు
తిప్పలు పడ్డారు. అయితే, ఆయనకు నిరాశే ఎదురైంది.
వైయస్
విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో
పాటుగా వచ్చి ఉంటే వివేకానంద
రెడ్డికి సులభంగా జగన్ దర్సనం జరిగి
ఉండేది. కానీ అలా జరగడం
లేదు. వైయస్ వివేకానంద రెడ్డిని
వైయస్ విజయమ్మ ఆదరించడం లేదో, వారితో రావడానికి
వివేకానంద రెడ్డే ఇష్టపడడం లేదో తెలియడం లేదు.
జగన్ కరుణిస్తే తప్ప వైయస్ వివేకానంద
రెడ్డిని కుటుంబ సభ్యులు ఆదరించే పరిస్థితి లేదని అంటున్నారు.
శనివారంనాడు
వైయస్ వివేకానంద రెడ్డి చంచల్‌గుడా జైలుకు
వెళ్లారు. ఒకప్పుడు తాను ఎమ్మెల్సీని అయినందున
తనను అనుమతించాలని ఆయన జైలు అధికారులతో
వాదించారు. అయితే, వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులకు ఇచ్చే రెండు ములాఖత్‌లు అయిపోయాయని జైలు
అధికారులు వివేకాకు అనుమతి ఇవ్వలేదు.
వైయస్
వివేకానంద రెడ్డి జూన్ 27వ తేదీన జగన్‌ను కలవడానికి చంచల్‌గుడా జైలుకు వెళ్లారు.
అప్పుడు ఆయనకు అనుమతి లభించలేదు.
దాంతో ఆయన ధర్నా చేశారు.
అయినా ఫలితం లేకుండా పోయింది.
ఉప ఎన్నికల సందర్భంలో అబ్బాయితో వైయస్ వివేకానంద రెడ్డికి
ప్యాచప్ జరిగినపోయినట్లే భావించారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ విజయానికి ఆయన ప్రచారం కూడా
చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు
ఎక్కడికక్కడ నిరాశనే ఎదురవుతోంది.
0 comments:
Post a Comment