మొన్న
శుక్రవారం విడుదలైన రాజమౌళి తాజా చిత్రం ఈగ
కలెక్షన్స్ ఊహించని విధంగా ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ కురుస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్ లో
ఈ చిత్రం కలెక్షన్స్ గబ్బర్ సింగ్ పోటీ ఇస్తాయని
అంచనా వేస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్స్
అందరికీ షాక్ ఇచ్చాయి. యుకె,యుఎస్ ఎ లలో
ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్
తో ఓపెన్ అయ్యింది. హీరో
ఎవరూ లేకుండా ఈగ చేస్తున్న హంగామా
పెద్ద హీరోల సినిమాలను దాటే
విధంగా సాగుతూండటం షాక్ చేస్తోంది.
ఏపీలోనే
ఈగ తొలిరోజు కలెక్షన్స్ .. - 4.68 కోట్లు నమోదు చేసింది. అలాగే
ఈగ చిత్రం తమిళం ‘నాన్ఈ' పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు,
కర్నాటక, కేరళల్లో ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల
చేశారు. ఓవర్సీస్‌లో కూడా భారీగా
థియేటర్లు కేటాయించారు. అక్కడి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ఏపీలోనే
తొలి రోజు దాదాపుగా రూ.
5 కోట్లు వసూలు చేసిన ఈగ
అన్ని చోట్ల వచ్చిన కలెక్షన్లు
కలుపుకుంటే స్టార్ హీరోలు నెలకొల్పిన రికార్డులు బద్దలు కొడుతుందేమో అంటున్నారు..
వెబ్
మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్త ప్రకారం ఇండియా
మొత్తం ఈచిత్రం తొలి రోజు రూ.
10 నుంచి 12 కోట్లు వసూలు చేసిందని, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు
వసూలు చేసింది తెలుస్తోంది. అయితే ఈ వార్త
నిజమా? కాదా? అనేది ఇంకా
అఫీషియల్ గా ఖరారు కావాల్సిఉంది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రాన్ని సాయి
కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై
నిర్మించారు. నాని, సమంత, సుదీప్
ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
0 comments:
Post a Comment