హైదరాబాద్:తారక్(ఎన్టీఆర్),కళ్యాణ్
రామ్ కూడా పూర్తిగా సర్పైజ్
అయ్యారు...మేము బాలకృష్ణను మంచు
మనోజ్ సినిమాలో చేయటానికి ఒప్పించినందుకు అంటూ గర్వంగా చెప్తున్నారు
మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె నిర్మిస్తున్న తాజా
చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'చిత్రం ఈ నెల 27న
విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె
మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే
బాలకృష్ణ పోషించిన పాత్ర సినిమాలో బాగా
ఎలివేట్ అయ్యింది. అందరూ మా నాన్నగారు
మోహన్ బాబు ని ఈ
సినిమాలో ఆ పాత్రకు తీసుకుంటామనుకున్నారు.
కానీ బాలకృష్ణ ని తీసుకోవటం అందరకీ
ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్చర్యపోయే ఫాక్టరే
సినిమాకు క్రేజ్ తెచ్చింది అన్నారామె.
నందమూరి
బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన
'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' ఆగస్టు 2న కాకుండా వారం
రోజులు ముందుగానే అంటే
అలాగే
...'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్
గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల
నిజమవుతోంది. మా టీమ్ ని
ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు.
అలాగే మా సినిమా కు
విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం
అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని మంచు మనోజ్
ఈ సందర్భంగా చెప్పారు.
బాలకృష్ణ
ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా
చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ
వరం' అని అన్నారు. అలాగే
ఊ కొడతా రా... ఉలిక్కి
పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం
దన్నారు. ఈ చిత్రాన్ని మంచు
లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను
పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని
ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల
వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను
వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో
హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి
పడతారా అన్ని వర్గాల వారిని
ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. ఇక బాలకృష్ణ రీసెంట్
గా నటించిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్
తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆయన
మళ్లీ హిట్ జోన్ లోకి
వెళ్తారంటున్నారు.
0 comments:
Post a Comment