అసిఫ్
అలీ, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం
'దిల్ సే'. మలయాళంలో విజయం
సాధించిన 'వయొలిన్' చిత్రానికి ఇది తెలుగు అనువాద
రూపం. శిబి మలయిల్ దర్శకత్వం
వహించిన ఈ చిత్రాన్ని యస్
టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. లక్ష్మి
అందిస్తున్నారు. ఈ చిత్రం రేపు(జూలై 27) విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్
సినిమా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఇది
రిథమిక్ లవ్ స్టోరీ. 'అలా
మొదలైంది', 'ఇష్క్' తర్వాత నిత్యకు ఈ సినిమా మరో
హిట్‌గా నిలవబోతోంది ఇందులో
పాత్రలు, వాటి చిత్రణా చాలా
బాగుంటాయన్నారు.
ఈ సినిమా చూశాక మనకూ వయొలిన్,
గిటార్ వంటివి నేర్చుకోవాలనిపిస్తుంది. ఓ మ్యూజిక్ టీచర్‌కి జీవితంలో ఎలాంటి
అనుభవాలు ఎదురయ్యాయనేది ఇందులోని ప్రధానాంశం. చక్కని క్వాలిటీతో డబ్బింగ్ చేశాం. జాతీయ అవార్డు గ్రహీత
మనోజ్ పిళ్లై సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని దృశ్య
కావ్యంగా మలచింది' అని చెప్పారు.
విజయ
రాఘవన్, నెడుముడి వేణు, శ్రీజిత్ రవి,
చెంబిల్ అశోకన్, లక్ష్మీ రామకృష్ణన్, రీనా బషీర్ తారాగణమైన
ఈ చిత్రానికి మాటలు: సత్య, సంగీతం: బిజిబల్,
కూర్పు: బిజిత్ బాలా, సహ నిర్మాత
డి. రామకృష్ణ, కథ, దర్శకత్వం: శిబి
మలయిల్.
0 comments:
Post a Comment