హైదరాబాద్:
కోర్టులు చివాట్లు పెట్టినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైయస్
విజయమ్మ తమ పార్టీ, తమ
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై
ఆరోపణలు మానడం లేదని తెలుగుదేశం
పార్టీ నేతలు రేవంత్ రెడ్డి,
యనమల రామకృష్ణుడు మంగళవారం మండిపడ్డారు. బాబుపై సుప్రీం కోర్టులో విజయమ్మ వేసిన పిటిషన్‌లో
ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
కేవలం
ఆయనను బద్నాం చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
సుప్రీం విజయమ్మ పిటిషన్ తిరస్కరిస్తూ ఎసిబిలో ఫిర్యాదు చేయమని సూచించలేదని, కానీ వైయస్సార్ కాంగ్రెసు
మాత్రం అత్యున్నత న్యాయస్థానం కోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని విమర్శించారు. న్యాయ పరిభాషలో ఎక్కడా
క్లీన్ చిట్ అనే పదం
లేదన్నారు. బురదలో కూరుకు పోయిన వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తమ పైన దానిని
జల్లే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
దివంగత
వైయస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబుపై పలు
కేసులు వేసి ఒక్క దానిని
నిరూపించ లేక పోయారన్నారు. బాబుపై
ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా
మారిందన్నారు. జగన్ ఎదుర్కొంటున్న కేసులు,
ఆయన అవినీతిపై తాము సంధించిన ప్రశ్నలకు
ఆ పార్టీ నేతలు ఎందుకు సమాధానం
చెప్పడం లేదని అడిగారు. రాష్ట్రపతి
ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఒక్కటేనని తేలిపోయిందన్నారు.
వేలెత్తి
చూపేలా బాబు పాలన సాగలేదన్నారు.
బాబుపై ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష
సాధింపు మాత్రమే అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు, టిడిపిపై
ఎలాంటి కేసులు లేవన్నారు. వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీలో భాగమే అన్నారు. అవినీతి
మంత్రులపై తాము చేసిన ఆరోపణలకు
ఎలాంటి సమాధానం రాలేదన్నారు. వారిపై తమ పోరాటం కొనసాగుతుందని
చెప్పారు. కేబినెట్ సమావేశం ఇక జైల్లో పెట్టుకోవాల్సిందేనని
ఎద్దేవా చేశారు.
మూడు
ప్రాంతాలలో ఇఫ్తార్ విందు
ముస్లిం
సోదరుల రంజాన్ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఇఫ్తార్
విందు ఇవ్వనుంది. ఆగస్టు ఒకటవ తేదిన హైదరాబాదులో
ఇఫ్తార్ విందు ఇస్తారు. ఈ
కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత విజయవాడ,
కర్నులులలో ముస్లిం సోదరులకు విందు ఇస్తారు.
0 comments:
Post a Comment