కొంత
కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హాట్
హీరోయిన్ సమంత ప్రస్తుతం కోలుకుంది.
ఈ విషయమై ఆమె ట్విట్టర్ ద్వారా
సందేశం పంపింది. ‘ఈగ మూవీ విడుదల
సందర్భంగా ఎక్కడ కనిపించడం లేదని
అంతా అడుగుతున్నారు. నేను రాక పోవడానికి
కారణం అనారోగ్యమే. ప్రస్తుతం కోలుకున్నా. త్వరలోనే షూటింగుల్లో పాల్గొంటా' అంటూ చెప్పుకొచ్చింది.
మరికొన్ని
రోజుల్లో సమంత నందినిరెడ్డి దర్శకత్వంలో
రూపొందబోయే చిత్రం షూటింగులో జాయిన్ కాబోతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ
హీరోగా నటిస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్
టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి
థమన్ సంగీతం అందిస్తున్నారు.ః
ఈచిత్రం
షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా.....డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ విషయంలో బెల్లకొండ
సురేష్ కి సమంతకి మధ్య
విబేధాలు రావడంతో సినిమా షూటింగ్ లేటవుతూ వచ్చింది. విషయం ఫిల్మ్ ఛాంబర్,
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు వెళ్లింది. డేట్స్
ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని బెల్లకొండ ఫిర్యాదు చేస్తే....షూటింగ్ డేట్స్ ముందే ఖరారు చేయక
పోవడంతో నేను వేరే సినిమాలకు
కమిట్ అయ్యానని సమంత వాదించింది. ఎట్టకేలకు
ఇరువురి మధ్య రాజీ కుదరడంతో
వివాదం సద్దుమనిగింది.
సమంత
ఈ చిత్రంతో పాటు మహేష్ బాబుతో
కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నాగచైతన్యతో కలిసి ‘ఆటోనగర్ సూర్య' చిత్రాల్లో నటిస్తోంది. రామ్ చరణ్-వంశీ
పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎవడు' చిత్రంలో కూడా
సమంత ప్రధాన నాయిక. మరో వైపు గౌతం
మీనన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న
‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం కూడా
చేస్తోంది.
0 comments:
Post a Comment