హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
మాజీ మంత్రులు దగ్గరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించిన బిసి
డిక్లరేషన్ విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మాజీ మంత్రులు కృష్ణ
యాదవ్, తలసాని శ్రీనివాస యాదవ్ సోమవారం వచ్చారు.
పలు బిసి సంఘాలతో కలిసి
వారు ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో అధినేతను కలిశారు. బిసి డిక్లరేషన్ ప్రకటించినందుకు
వారు బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు.. బిసి డిక్లరేషన్ ప్రకటించిన
తమపై ఇతర పార్టీలు విమర్శలు
మానుకోవాలని సూచించారు. బిసిలకు ఎక్కువ మేలు చేసిన పార్టీ
టిడిపి మాత్రమే అన్నారు. రాజ్యాధికారంతో పాటు ఆర్థిక స్వావలంభన
కోసమే తాము బిసి డిక్లరేషన్
ప్రకటించామన్నారు. ఇతర పార్టీలకు దమ్ముంటే
తమ కంటే మంచి డిక్లరేషన్
ఇవ్వాలని సవాల్ చేశారు.
అనంతరం
కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. బిసిలకు
అధికంగా మేలు జరిగింది తెలుగుదేశం
పార్టీ హయాంలోనే అన్నారు. తాను తన కార్యకర్తలతో
చర్చించిన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరతానని తెలిపారు. కృష్ణ యాదవ్ టిడిపి
అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు.
కాగా
సుప్రీం కోర్టులో విజయమ్మ పిటిషన్ తిరస్కరించడంపై ఆ పార్టీ నేత
అరవింద్ గౌడ్ స్పందించారు. చంద్రబాబు
ఆస్తుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై
ఆనందం వ్యక్తపరిచారు. చంద్రబాబు విషయంలో న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు న్యాయస్థానాలను అవమానపరుస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో
మూడు పార్టీలు ప్రజలతో ఆడుకుంటున్నారని, అధికార కాంక్షతోనే విజయలక్ష్మి సిరిసిల్ల యాత్ర అని అరవింద్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. చంద్రబాబుపై
రాజకీయ దురుద్దేశంతోనే కేసు వేశారన్నారు.
0 comments:
Post a Comment