హీరోయిన్
త్రిష... రవితేజ ‘సార్ వస్తారా' సినిమా
ఆఫర్ తిరస్కరించడంతో పాటు...ప్రభుదేవా బాలీవుడ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' రీమేక్ ప్రాజెక్టులో నటించడానికి నో చెప్పి ఇటీవల
హెడ్ లైన్స్‌లో నిలిచిన సంగతి
తెలిసిందే. తాజాగా ఈ చెన్నయ్ చిన్నది
మరో ఆసక్తికరమైన న్యూస్‌తో వార్తల్లో కెక్కింది.
టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఓ
రూమర్ ప్రకారం త్రిష ప్రముఖ నిర్మాత
రామానాయుడు మనవడు, యంగ్ హీరో రాణా
దగ్గుబాటితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట
పలు పార్టీలకు, ఈవెంట్లకు హారవుతూ చాలా క్లోజ్ అయ్యారని
అంటున్నారు. ఇటీవల జరిగిన ఫిల్మ్
ఫేర్ అవార్డుల్లో జంటగా వచ్చి అందరినీ
ఆశ్యర్య పరచడం కూడా ఈ
రూమర్లకు మరో కారణం.
ఇంతటితో
ఆగకుండా ఇటీవల ఓ సౌత్
సినీ మేగజైన్ కోసం కలిసి ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. అయితే
కొందరు మాత్రం నయనతారను ఏడిపించడానికే త్రిష అలా చేస్తోందని,
కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో
రాణా, నయనతార కలిసి నటిస్తుండటంతో కావాలనే
త్రిష ఈ విధంగా ప్రవర్తిస్తోందని
అంటున్నారు.
అయితే
ఇటీవల వీరు ఓ ప్రముఖ
ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తమ మధ్య ప్రేమ
దోమ ఏమీ లేదని, మేము
కేవలం మంచి స్నేహితులం మాత్రమే
అని అంటున్నారు. త్రిష ఎవరితో క్లోజ్‌గా ఉన్నా ఏదో
ఒక గాసిప్ పుట్టుకురావడం మామూలే. గతంలో ఆమె రవితేజ,
విశాల్, ప్రభుదేవా, కరుణానిధి మనవడు ఉదయనిధిలతో లవ్వాయనం
నడిపినట్లు రూమర్లు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్లే
అని తేలాయి. తాజాగా రాణా-త్రిష వార్త
కూడా రూమర్ తేలడం ఖాయమని,
వారి మధ్య అలాంటిదేమీ లేదని
వారి సన్నిహితులు అంటున్నారు.
0 comments:
Post a Comment