హీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా తన సోదరుడి తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ చెప్పినట్లేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన బావమరిది బాలయ్యను పొలిటికల్ ఆరంగేట్రం చేయించారని అంటున్నారు. ఇదంతా బాబు ప్లాన్ అని చెబుతున్నారు. ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లు బాలయ్య రాకతో చంద్రబాబు రెండు మూడు విధాలాగా టిడిపికి లబ్ధి చేకూర్చేలా ప్లాన్ గీశారని చెబుతున్నారు.
తన తనయుడు నారా లోకేష్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చే విషయమై పార్టీలో చర్చకు వచ్చే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును ఆయన వర్గం వారు తెర పైకి తీసుకు వచ్చేవారు. గతంలో చంద్రగిరి నియోజకవర్గానికి లోకేష్ పేరును సూచించేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంటున్న సమయంలో కృష్ణా జిల్లా జూనియర్ వర్గం నేతలు ఆయన పేరును ప్రతిపాదించారు. ఇటీవల కూడా లోకేష్ పేరు తెర పైకి వచ్చినప్పుడు జూనియర్ వర్గం వ్యూహాత్మకంగా ధీటుగానే స్పందించింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ వ్యాపారాలు చూసుకుంటున్నారని, రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. కొడాలి నాని వ్యవహారం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను చిన్న వాడినని, తనకు రాజకీయాల్లోకి వచ్చేంత వయస్సు లేదని, మరో 20-25 ఏళ్ల వరకు తాను రాజకీయాల్లోకి రానేమోనని చెప్పారు. అయితే బాబు వ్యూహాత్మకంగా లోకేష్ పేరును వెనక్కి తీసుకొని తద్వారా జూనియర్‌ను పక్కకు తప్పించారని చెబుతున్నారు.
అయితే లోకేష్‌కు విరుగుడుగా బాలకృష్ణను తీసుకు వచ్చిన బాబు జూనియర్‌ను సైలెన్స్ చేశారని అంటున్నారు. ఇదంతా బాబు పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని చెబుతున్నారు. లోకేష్ పేరు వస్తే జూనియర్ వర్గం బయటకు వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ అయితే జూనియర్ అండ్ కో సైలెంట్‌గా ఉంటుందని భావించిన బాబు బాలకృష్ణతో రాజకీయ ఆరంగేట్ర ప్రకటన చేయించి ఉండవచ్చునని చెబుతున్నారు. బాబు ఊహించినట్లుగానే బాలకృష్ణ ఆరంగేట్ర ప్రకటన తర్వాత జూనియర్ వర్గం నుండి ఎలాంటి వ్యతిరేక స్పందన లేక పోవడం గమనార్హం.
బాలయ్య ద్వారా బాబు తన తనయుడి రాజకీయ ఎంట్రీకి స్కెచ్ వేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పట్లో కాకపోయినా మరో నాలుగైదేళ్ల తర్వాత లోకేష్ ఎంట్రీ ఖాయమని చెబుతున్నారు. బాలయ్య ద్వారా భవిష్యత్తులోనూ జూనియర్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఇదే కాకుండా బాలయ్య క్రౌడ్ పుల్లర్ కాబట్టి ఆయన రంగంలోకి దిగితే ప్రజలు టిడిపి పట్ల ఆకర్షితులవుతారని కూడా బాబు భావించారని చెబుతున్నారు.

0 comments:
Post a Comment