గుంటూరు: జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. విద్యుత్ సమస్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఈ పార్టీలో గ్రూపులు బయటకు వచ్చాయి. బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తెనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించింది.
ఈ సమయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మరో నేత విజయ భాస్కర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ సమయంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేతలు, పోలీసుల జోక్యంతో ఇది కాసేపటికి సద్దుమణిగింది. అయితే ప్రభుత్వంపై పోరాడుతున్న సమయంలో బహిరంగంగా ఇలా గ్రూపు విభేదాలు బయటపడటం పట్ల పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
కాగా కరెంటు కోతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో కూడా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.నియోజకవర్గంలోని సింహాద్రిపురం, వేంపల్లి, పులివెందుల మండలాలలోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె వద్ద చేపట్టిన ధర్నాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
రైతులకు ఏడు గంటల కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైట్లు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు.

0 comments:
Post a Comment