హైదరాబాద్:
శాసనసభను సమావేశపరిస్తే మీరు వాకౌట్ చేస్తారు
కదా అని రాష్ట్ర గవర్నర్
నరసింహన్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేతలపై సెటైర్ వేశారు. విద్యుత్ సమస్య తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం
పార్టీ ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ
సందర్భంగా వారు... కరెంట్ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా
ఉందని, వెంటనే శాసనసభను సమావేశపర్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అప్పుడు
గవర్నర్ మాట్లాడుతూ.. సమావేశపరిస్తే మీరు వాకౌట్ చేస్తారు
కదా అని సెటైర్ వేశారు.
అందుకు టిడిపి నేతలు కూడా ధీటుగానే
స్పందించారు. వాకౌట్ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న
నిరసన ప్రక్రియ అని వారు అన్నారు.
కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం
వారు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చే విధంగా ప్రభుత్వానికి సూచించాలని అలాగే కళంకిత మంత్రులపై
సిఎం చర్యలు తీసుకునే విధంగా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
ప్రభుత్వానికి
తాము ఇచ్చే చివరి అవకాశం
ఇదేనని, కరెంట్ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని, సమావేశాలు
నిర్వహించాలని మరో నేత ఎర్రబెల్లి
దయాకర రావు డిమాండ్ చేశారు.
రేపటిలోగా ప్రభుత్వం తమ నిర్ణయం చెప్పకుంటే
ఉద్యమిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
నిర్లక్ష్యం వల్లనే కరెంట్ సంక్షోభం రాష్ట్రంలో ఇంత తీవ్రంగా ఉందని
ఆరోపించారు. సమస్య ఇంత తీవ్రంగా
ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
0 comments:
Post a Comment