హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చేసే తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయడానికి చంద్రబాబు సిద్ధపడుతుండగా, ఆ మేరకు కేంద్రానికి మరోమారు లేఖ రాస్తామని బాలకృష్ణ చెప్పేశారు. తెలంగాణపై బాలకృష్ణ సూటిగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
అయితే, జాతీయ రాజకీయాలకు ఢిల్లీ వెళ్లడానికి, బాలయ్య సీమాంధ్రకు నాయకత్వం వహించడానికి మానసికంగా సిద్ధపడే తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. బాలయ్య తెలంగాణ అనుకూల ప్రకటనతో ఆసక్తికరమైన చర్చలు తెలుగుదేశం పార్టీలో ప్రారంభమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్పష్టం చేస్తే రెండు రాష్ట్రాలు ఖాయమనే మాట వినిపిస్తోంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అవుతుంది.
ఈ స్థితిలో సీమాంధ్రలో బాలయ్య పాత్ర పోషిస్తే తెలంగాణను మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని అంటున్నారు. తెలంగాణ గడ్డపైనే పుట్టాను.. తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని సెంటిమెంటుగా కట్టిపడవేశాయని, కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదని తెలుగు తమ్ముల్లు సంబరపడిపోతున్నారు.
తెలుగు తమ్ముళ్ల మాటలు నిజమైతే తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడు అయ్యే అవకాశాలు బాగానే ఉంటాయని అంటున్నారు. తెలంగాణకు జూనియర్ ఎన్టీఆర్‌ను ముందు పెడితే హరికృష్ణ కూడా తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుంటే సర్దుకుపోవచ్చునని అంటున్నారు.

0 comments:
Post a Comment