హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ మరో పౌరాణిక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆంధ్ర భోజ శ్రీ కృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో బాలకృష్ణ ఆదిత్య 369 చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయల పాత్రను అద్భుతంగా చేసిన నేపథ్యంలో రాఘవేంద్రరావు బాలయ్యను ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇదివరకు బాలయ్యతో కలిసి పాండు రంగడు చిత్రం రూపొందించి భక్తి, రక్తి రసాన్ని అద్భుతంగా పండించిన దర్శకేంద్రుడు...తాజాగా శ్రీకృష్ణ దేవరాయలపై తీసే చిత్రంలో రాయలపాలన ఎలా ఉండేది అనే అంశాలను చూపెట్టడంతో పాటు ఆయనలోని కవి హృదయాన్ని, రస హృదయాన్ని సినిమాలో ఫోకస్ చేయనున్నారట.
మరో వైపు బాలయ్య ‘ఆదిత్య 369'కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999' చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
బాలయ్య ప్రస్తుతం ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తుండగా ఎల్లోఫ్లవర్స్ పతాకంపై పుప్పాల రమేష్ నిర్మిస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. ఆగస్టు చివరి వారంలో ఈచిత్రం విడుదల కానుంది.

0 comments:
Post a Comment