హైదరాబాద్ : హీరో నాని నిశ్చితార్థం ఆదివారం విశాఖపట్నంలో అంజనతో జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందనీ, అది ప్రేమగా మారిందనీ మీడియాలో వార్తలొచ్చాయి. వాటిని నాని ఖండించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..''అంజనతో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. ఆమె నాకు ఫేస్‌బుక్, ఆర్క్యూట్‌లో పరిచయమమైందని, ఒకరికొకరు చూసుకోకుండానే ప్రేమించుకొన్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదు'' అన్నారు నాని.
అలాగే ఈ సంగతుల్ని నాని ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ''మా ఇద్దరిది ఫేస్‌బుక్ ప్రేమ కాదని గతంలోనే చెప్పాను. అయినా చిన్నపాటి గందరగోళం ఉంది. మా ఇద్దరికీ పరిచయమయ్యేటప్పటికి ఫేస్‌బుక్, ఆర్కుట్‌లు లేవు'' అంటూ ట్వీట్ చేసారు. ఇక ఆదివారం మధ్యాహ్నం 1.03 నిమిషాలకు వీరి వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశారు.
నాని నటించిన ఈగ ఇటీవల విడుదలై విజయం సాధించగా, ఆయన గౌతమ్ మీనన్ చిత్రంలో, జెండాపై కపిరాజు చిత్రంలో, కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. నాని, ఆమలాపాల్ జంటగా వాసన్స్ విజువల్స్ వెంచర్స్ పతాకంపై రూపొందిస్తున్న ‘జెండాపై కపిరాజు'. ఆ మధ్యన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పి.సముద్రఖని (శంభో శివ శంభో ఫేం) దర్శకత్వంలో కె.శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ ప్రతిరోజూ మన సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యల గురించి ఈ చిత్రం చర్చిస్తుందని, ప్రజలు తమ పని తాము కచ్చితంగా చేస్తే ప్రపంచమంతా చక్కగా సాగుతుందన్న అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు. ఇక సందేశాత్మకంగా సాగే ఈ చిత్రం లోని పాటలను మొదటగా గోవాలో చిత్రీకరిస్తామని, సెప్టెంబర్, అక్టోబర్‌లలో హైదరాబాద్, వైజాగ్‌ల్లో షెడ్యూల్స్ జరుగుతాయని నిర్మాత తెలిపారు. ఆమలాపాల్, శశాంక్ వెన్నెలకంటి, జి.వి.ప్రకాష్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ఎన్.సుకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, ఎడిటింగ్: ఎస్.ఎన్.్ఫజిల్, నిర్మాత: కె.శ్రీనివాసన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సముద్రఖని.

0 comments:
Post a Comment