వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన భవంతులు ముడుపులతో వచ్చిన డబ్బుతో కట్టినవని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఆరోపించింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇటీవల నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో నాలుగో ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీషీట్‌లో వాన్‌పిక్ వ్యవహారాన్ని పేర్కొంది.
వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఇందులో స్పష్టం చేసింది. అదే సమయంలో హైదరాబాదులోని, బెంగళూరులోని అత్యాధునిక జగన్ ఇళ్లు కూడా ముడుపులతో వచ్చిన డబ్బులతో నిర్మించినవే అని సిబిఐ తన ఛార్జీషీటులో ఆరోపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కోట్లాది రూపాయలను జగన్ కంపెనీలలో పెట్టారన్నారు.
నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీల నుండి సుమారు రూ.57 కోట్ల రూపాయలు సిలికాన్ బిల్డర్స్‌కు వచ్చాయని, ఆ కంపెనీ ఇన్‌స్పైర్ హోటల్స్, షాలోమ్ ఇన్ ఫ్రా, మార్వేల్ ఇన్ ఫ్రా, క్యాప్స్‌టోన్, యుతోపియా తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. నిమ్మగడ్డకు చెందిన కోట్లాది రూపాయలు హైదరాబాద్, బెంగళూరులోని జగన్ నివసిస్తున్న ఇళ్లు నిర్మించేందుకు ఉపయోగించారని పేర్కొన్నారు.
సిలికాన్ బిల్డర్స్ జగన్‌కు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చిందని తెలిపారు. నిమ్మగడ్డ గ్రూపు కంపెనీలు వైయస్సార్ ఫౌండేషన్‌కు రూ.7 కోట్లు విరాళం రూపంలో ఇచ్చిందని తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 18,878 ఎకరాల ప్రభుత్వ/అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు కేటాయించడంలో ధర్మాన కీలక పాత్ర పోషించారని కూడా సిబిఐ తన ఛార్జీషీట్‌లో పేర్కొంది.

0 comments:
Post a Comment