అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందట. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 1990లలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే చిత్రాన్ని రీమేక్ చేయాలని విష్ణు భావిస్తున్నారు. చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పటికీ వైయస్ జగన్ ఆధారంగా చిత్రం ఉండేలా చూస్తున్నారట. జగన్ తన అరెస్టుకు ముందు మోహన్ బాబు ఇంటికి భార్య భారతితో సహా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతును జగన్ కోరారు. అయితే జగన్ ఇంటికి రావడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని, తన తనయుడికి కవలలు పుట్టినందువల్లే చూసేందుకు వచ్చారని మోహన్ బాబు చెప్పారు. కానీ రాజకీయ ప్రాధాన్యత ఆ భేటీలో ఉందనేది పలువురి వాదన. ఆ తర్వాత జైలులో కూడా ఓసారి తనయుడితో వెళ్లి కలిశారు.
మోహన్ బాబు, జగన్ బంధువులు అవుతారు. దీంతో జగన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తీయాలని చూస్తున్నారట. ఓ యువకుడు రాజకీయాల్లోకి రావడం, అవినీతి ఆరోపణలు చేసి అతనిని జైలుకు పంపడం, అయితే ప్రజలు మాత్రం అతని ఇన్నోసెన్స్ గుర్తించి అతనికే అండగా నిలబడటం, ఓట్లు ఆయన పార్టీకే వేయడం, బ్యాలట్ బాక్స్ ద్వారా ఆ యువకుడు నిందితుడు కాదని ప్రజలు గట్టిగా నమ్మి, అతని విడుదలను కోరటం, కోర్టులో కూడా అతని నేరాలు రుజువు కాకపోవడంతో విడుదల కావడం, ఆ తర్వాత అతను అసెంబ్లీలోకి ఎంటర్ కావడం.. ఇలా సాగుతుందట కథ.
ఇదంతా జగన్‌ను బేస్‌గా తీసుకొని ఈ చిత్రం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే విష్ణు మాత్రం జగన్ బేస్డ్‌గా అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేస్తున్నారట. తమ చిత్రానికి జగన్ జీవిత చరిత్రకు ఎలాంటి సంబంధం లేదని విష్ణు చెబుతున్నారట. ఈ చిత్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఇలా పలు అంశాలు ఉంటాయని, కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో కాదని చెబుతున్నారట. తాము ఒరిజినల్ స్క్రిప్ట్‌ను ఏమాత్రం మార్చలేదని చెబుతున్నారట. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నారు.

0 comments:
Post a Comment