Showing posts with label Daruvu. Show all posts
Showing posts with label Daruvu. Show all posts

Wednesday, June 6, 2012

Tapsi About Her hit or Flop


ఝుమ్మంది నాదం నుంచి ఇప్పటివరకూ తాప్సీ నటించిన తెలుగు సినిమా ఏదీ విజయం సాధించలేదు. రీసెంట్ గా వచ్చిన 'దరువు'కూడా మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. నేపధ్యంలో ఆమె మీడియాతో సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడిన మాటలు 'దరువు'గురించేనా అనే సందేహ పడుతున్నారు. సినిమా హిట్,ప్లాప్ లకు సంభదం లేకుండా తను కష్టపడి చేసుకుపోతానంటూ చెప్పుకొచ్చింది.

తాప్సీ మాట్లాడుతూ.... మన స్నేహితులు నలుగురుంటే.. నలుగురి అభిరుచులు నాలుగు రకాలుగా ఉంటాయి. మరి కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని, వారందరూ మెచ్చుకొనేలా సినిమా తీయడం ఇంకెంత కష్టం..అంది. అలాగే ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాలన్నీ నాకు నచ్చే చేశాను. అవి ప్రేక్షకులకు నచ్చాయా..లేదా అనేది వేరే విషయం. ఎందుకంటే నా గదిలో కూర్చుని ప్రేక్షకులందరి ఆలోచనల్ని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఎక్కువ మందికి చేరువైందా..లేదా..అనే విషయాలను పట్టించుకొంటే చాలు అని శెలవిచ్చింది.

హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత తగ్గిన విషయం మాట్లాడుతూ..తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని అంటున్నారు. ఎక్కడైనా ఇదే తంతు. నేను తమిళ, హిందీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. అక్కడ కూడా హీరోయిన్ కోసం గొప్ప పాత్రలు పుట్టడం లేదు అని చెప్పుకొచ్చింది.

తాప్సీ ప్రస్తుతం గోపీచంద్ తో మరో చిత్రం చేస్తోంది. గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ లో మొగడు చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక చిత్రంలో గోపీచంద్ నిధి అన్వేషణలో పూర్తిగా మునిగి తేలనున్నాడు. గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో వచ్చినఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tuesday, May 29, 2012

Daruvu Effect on Gabbar singh


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినగబ్బర్ సింగ్భారీ కలెక్షన్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ‘దమ్ముజోరు తగ్గాకగబ్బర్ సింగ్బాక్సాఫీసుపై దూకడంతో మార్కెట్లో పోటీ లేకుండా అయి పోయింది. నేపథ్యంలో చిత్రం జోరును తగ్గించేది రవితేజదరువుమాత్రమే అని మార్కెట్ వర్గాలు గతంలో విశ్లేషించాయి.

అయితే తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం...‘దరవుచిత్రంగబ్బర్ సింగ్కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోగా, గబ్బర్ సింగ్ ప్రభంజనం ధాటికి తట్టుకోలేక పోతోంది. కారణందరువుచిత్రం తొలి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకోవడమే అని అంటున్నారు. కథ కథనం పాతదే కావడం, రొటీన్ రవితేజ మార్క్ ఎంటర్ టైనర్ కావడంతో జస్ట్ యావరేజ్గా మిగిలి పోయింది. దీంతో గబ్బర్ సింగ్ చిత్రం మూడో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

నెల 25 విడుదలైన దరువు చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.... చిత్రం తొలి రోజు రూ. 4.4 కోట్ల వసూళ్లూ సాధించింది. రెండో రోజైన శనివారం రూ. 3.8 కోట్లు. అయితే తిరిగి ఆదివారం రోజు పుంజుకుని రూ. 4. 5 కోట్లు సాధించింది. టోటల్ గా తొలి మూడు రోజులు 12.7 కోట్ల వసూళ్లు సాధించింది. గబ్బర్ సింగ్ చిత్రం మూడో వారంలోనూ దరువుతో పోటీ పడుతూ వీకెండ్లో దాదాపుగా 8 కోట్ల వసూళ్లు సాధించింది.

కాగా...జూన్ 1 బాలయ్య నటించినఅధినాయకుడుచిత్రం విడుదలవుతోంది. సినిమా వచ్చాక గబ్బర్ సింగ్, దరువుల కలెక్షన్ల పరిస్థితి విధంగా ఉంటుందో అనేదానిపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.

Funny Dhinkachika Explanation


Friday, May 25, 2012

Daruvu Movie review


సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ఫిలిమ్స్
నటీనటులు: రవితేజ, తాప్సీ, సత్యనారాయణ, ప్రభు, బ్రహ్మానందం, ఎమ్మెస్నారాయణ, సాయాజీషిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, అవినాష్‌, సన తదితరులు
సంగీతం: విజయ్ఆంటోని
కథ, స్క్రీన్ప్లే: శివ, ఆదినారాయణ,
కెమెరా: వెట్రివేల్
డైలుగులు: రమేష్ గోపి మరియు అనిల్
నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు
సమర్పణ: నాగమునీశ్వరి
కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: జె. శివ కుమార్
విడుదల తేదీ: 25 మే 2012

రవితేజ వంటి కామెడీ పండించే స్టార్ .. హిట్ ఫార్ములా అయిన యమలోకం బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే రేంజిలో వినోదం ఉంటుందో అని చాలా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అయితే వాటిన్నటికి దూరంగా..'దరువు'ని రెగ్యులర్ కథాంశాన్ని ఎంచుకుని, రొటీన్ సీన్స్ తో నింపేసారు. ముఖ్యంగా యమలోకం లో రవితేజ చేసే హంగామా అయితే అస్సలు పేలనే లేదు. రవితేజ ఎంత ఎనర్జీతో చేసినా, తాప్సీ ఎంతగా గ్లామర్ ని చూపినా, సెట్స్ తో హంగామా జరిగినా స్క్రిప్టు లోపం వాటిన్నటినీ హైలెట్ కానివ్వలేదు.

చిత్రగుప్తుడు(ఎంఎస్)తన బాస్ యమధర్మరాజు(ప్రభు)మీద కోపంతో,ఆయన్ని ఇరికించాలని భూలోకంలో ఉండే వ్యక్తిని లేపేసి తన లోకం తీసుకువస్తాడు. వ్యక్తే బుల్లెట్ రాజా (రవితేజ). దొంగతనాలు చేసుకు బ్రతికే బుల్లెట్ రాజా అప్పటికి శ్వేత (తాప్సీ)తో ప్రేమలో పడి పాడుకుంటుంటాడు. అంతేగాక ఆమె కోసం ఆమె బావ హార్బర్ బాబు (సుశాంత్ సింగ్)తో తలపడి గెలిచేలోగా పైకి పోతాడు. అయితే నరకంలో అసలు విషయం తెలుసుకున్న బుల్లెట్ రాజా, అక్కడ యముడుతో తగువు పెట్టుకుని తిరిగి భూలోకానికి రావటానికి ప్లాన్ చేసుకుంటాడు. అయితే అప్పటికే అతని శవం కాలి బూడిదై పోయింది. అప్పుడు తన పోలికలతోనే ఉన్న రవీందర్(మళ్లీ రవితేజ) అనే మర్డరైపోయి చనిపోయిన హోం మినస్టర్ శరీరంలో ప్రవేశిస్తాడు. తర్వాత బుల్లెట్ రాజా ఏం చేసాడు... తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు.. హోం మినిస్టర్ ని చంపిన వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడన్నది మిగతా కథ.

యమలోకం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గత చిత్రాలును గుర్తు చేసే చిత్రం.. మొదట హీరో ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానితో హీరో శరీరం మార్చుకున్న తర్వాత తన ప్రేమ కోసం చేసే పనులు, వాటికి వచ్చే అడ్డంకులు దిశగా సినిమా నడుస్తుందనుకుంటాం. అయితే అలా కాకుండా హీరో ప్రవేశించే హోం మినిస్టర్ పాత్రకుండే సమస్యలను తీర్చేటట్లు కథనం ఏర్పాటు చేసారు. దొంగగా ఉండే హీరో ఎందుకు అలా హోం మినిస్టర్ శరీరంలోకి ప్రవేశించినా తన క్యారక్టరైజేషన్ ని మర్చిపోకుండా.. ఎంజాయ్ చేయక లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు.. ప్రజలు కోసం ఎందుకు పాటు పడతాడు అన్న సందేహాలు కలిగాయి. దాంతో సన్నివేశాలు బాగున్నా క్యారక్టర్ కి, సీన్స్ కి మధ్య కనెక్టవిటి కట్ అయ్యిందిం. దానికి తోడు హీరో ఏక పక్షంగా ఎదురే లేకుండా(నెగిటివ్ పాత్రలు ఏమి చేయకుండా) దూసుకుపోతూండటంతో, కాంప్లిక్ట్ లేకుండా పోయి, డ్రామా మిస్సైంది. దాంతో సెకండాఫ్ మొత్తం ఏదో సీరియల్ లా సాగుతున్న ఫీలింగ్ కలిగింది. ఇది కథన సమస్యే.

నటీనటుల్లో రవితేజ తన రొటీన్ హావ భావాలతో నవ్వించే ప్రయత్నం చేశాడు. శ్వేతగా తాప్సీ ఎప్పటిలాగే నటనను వదిలేసి.. గ్లామర్ ను తన శక్తి మేరకు ఒలకపోసింది. పాటల విజువలైజేషన్ లోఉసుమలరాసేపాట బాగుంది. సినిమాకు హైలెట్ గా భావించి ఫుల్ లెంగ్త్ గా విద్యాబాలన్ పాత్రలో బ్రహ్మానందం ఉన్నంత సేపు నవ్వించాడు. హీరో తల్లిగా జయసుధ కొత్తగా చేయకపోయినా సెంటిమెంట్ బాగా పండించింది. డింక్ చికా.. డింక్ చికా అంటూ పవిత్రానంద స్వామిగా రఘు బాబు, హోం మినిస్టర్ పిఎ పాత్రలో శ్రీనివాస రెడ్డి బాగా నవ్వించారు. ఆడియో సినిమాకు ప్లస్ కాలేదు. డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. శివ పూర్వాశ్రమంలో కెమెరామెన్ కావటంతో విభాగం బాగానే ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇకొంచెం షార్పు చేసి ఉంటే బాగుండేదనిపించిది.

రవితేజ సినిమా కదా తెగ నవ్వేసుకోవచ్చు అని పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది. వేసవికాలం కాస్సేపు ఎసి లో కూర్చోవచ్చు అని వెళితే లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి బాగానే గిట్టుబాటు అవుతుంది. టోటల్ గా ప్రేక్షకులకు సినిమా చూశాక బరవు మోసిన పీలింగ్ ని ఇస్తుంది.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget