Showing posts with label Kurnool. Show all posts
Showing posts with label Kurnool. Show all posts

Sunday, June 17, 2012

Toll plaza fees demand from YSRC Mla


కర్నూలు/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజంపేట శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి వాహనాన్ని ఆదివారం టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. ఇది కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. గుర్నాథ్ రెడ్డి కారును కర్నూలు జిల్లా ఆలంపూర్ టోల్ గేటు వద్ద సిబ్బంది నిలిపివేశారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది ఎమ్మెల్యేను అడిగారు.

తాను ఎమ్మెల్యేనని గుర్నాథ్ రెడ్డి సిబ్బందికి చెప్పారు. స్టిక్కర్ లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించాలని వారు పట్టుబట్టారు. దీంతో గుర్నాథ్ రెడ్డి రహదారి పైనే బైఠాయించారు. ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. వారు జోక్యం చేసుకొని గుర్నాథ్ రెడ్డిని అక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కాగా ప్రజల వద్దే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. జగన్ ఆదేశాల మేరకు వార్డు బాట చేపట్టానని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడితే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేయలేదని పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పిట్టల దొర వేషాలు, కాకి లెక్కలు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జలీల్ ఖాన్ విజయవాడలో హితవు పలికారు. జగన్కు ఉన్నది సానుభూతి కాదని ప్రజాధరణ అన్నారు. తాజా ఉప ఎన్నికలలో గెలిచిన వారు 2009 ఎన్నికల కంటే 30 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బొమ్మతో తిరిగిన కాంగ్రెసుకు రెండు సీట్లే వచ్చాయన్నారు.

Wednesday, June 6, 2012

Sharmila fires at Sonia Gandhi


కర్నూలు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతోనే తన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిందని షర్మిల ఆరోపించారు. బుధవారం షర్మిల తన తల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిసి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఆజాద్ వ్యాఖ్యలు కక్ష సాధింపు కాదా అన్నారు.

సోనియా ఆదేశాలు ఇవ్వడమేమిటి జగన్ను అరెస్టు చేయడమేమిటని షర్మిల ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తన కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువగా మమేకమయ్యారన్నారు. కర్నూలుతో జగన్కు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మంచి అనుబంధముందని చెప్పారు. సోనియా ఆదేశాలతోనే గత నెల 27 జగన్ను అరెస్టు చేశారని ఆరోపించారు.

కాంగ్రెసుకు ఓటేస్తే ఫ్యాక్షనిజానికి ఓటేసినట్లేనని షర్మిల అన్నారు. జరుగుతున్న అన్యాయానికి ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. విచారణ పేరుతో ఆధారాలు లేకున్నా.. అబద్దపు సాక్ష్యాలతో జగన్ను జైల్లో ఉంచారన్నారు. రైతుల పక్షాన నిలబడి, తమ కుటుంబానికి అండగా నిలబడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

వైయస్ జలయజ్ఞంతో సహా పలు అభివృద్ధి పనులు ఇక్కడి నుండే ప్రారంభించారని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన కాంగ్రెసు ఇప్పుడు ఆయనను నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వైయస్ తనయుడి అయినందు వల్ల జగన్ను అరెస్టు చేశారన్నారు. జగన్ బయట ఉంటే పద్దెనిమిది మందిని గెలిపించుకోగల్గుతాడని భావించే అరెస్టు చేశారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదు నడిబొడ్డున అప్పనంగా భూములు కట్టబెడితే ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబు పైన తాను కేసు వేసినప్పుడు నెల రోజులు అయినా సిబిఐ విచారణ ప్రారంభించలేదని, అదే జగన్ ఆస్తుల కేసు విషయంలో మాత్రం ఒక్క రోజులోనే ప్రారంభించారన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో సోనియా ఇంటి పైన, మద్యం సిండికేటు కేసులో బొత్స సత్యనారాయణ ఇళ్లలో దాడులు జరిపారా అని ప్రశ్నించారు.

వైయస్ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, మహిళలను లక్షాధికారులను చేయాలని చూశారన్నారు. పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారన్నారు. కానీ ప్రభుత్వం పథకాలను నీరుగారుస్తోందన్నారు. దశ చరిత్రలో పన్నులేయని ప్రభుత్వం వైయస్దే అన్నారు. 170 మంది ఎంపీలపై కేసులు ఉంటే అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్కు కర్నాటక, కరీంనగర్లలో ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.

సిబిఐ కేంద్రం కనుసన్నుల్లో నడుస్తోందని ఆరోపించారు. జగన్ కాంగ్రెసులో ఉంటే ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి అయి ఉండేవారని పార్టీ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారని, తద్వారా వారు తమ కుటుంబంపై కక్ష తీర్చుకుంటున్నట్లుగా అర్థమవుతోందన్నారు. వైయస్ మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. తనకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని తామే చంపుకున్నామని కాంగ్రెసు నేతలు చెబుతున్నారని, ఇది తను ఎంతో కలిచి వేస్తోందన్నారు. జగన్కు అధికార దాహమే ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసినప్పుడే ముఖ్యమంత్రి అయయే వాడన్నారు. వైయస్సార్కు అసెంబ్లీలో సంతాపం తెలిపేందుకు రెండు నెలలు పట్టిందని విమర్శించారు. జగన్ను అరెస్టు చేసినప్పుడే తాను ప్రశ్నించానని, కానీ ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేదన్నారు.

మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీలు చేస్తున్నారని, ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా అన్నారు. పద్దెనిమిది మంది అభ్యర్థులను గెలిపించుకునేందుకే తాను బయటకు వచ్చానని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రవేశ పెట్టే పథకాలు పార్టీ జెండాలోనే ఉన్నాయన్నారు. దేవుడుపై నుండి, ఇక్కడ మీరు వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నారని అన్నారు.

కాగా మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి ఎర్రకోటలో వైయస్ విజయమ్మ, షర్మిలలను కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా వారిని కలిశారు.

Wednesday, May 16, 2012

CM Kiran lashes at Ys jagan


కర్నూలు/నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతిపరుడు అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు, జిల్లాకు చెందిన మేధావులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో, బిజెపితో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు గెలిచినా కాంగ్రెసును కాదని ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు, జగన్ వద్ద నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మేధావుల సదస్సులో మాట్లాడుతూ.. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బిరామి రెడ్డి విశాఖను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారన్నారు.

అలాంటి వ్యక్తి రూ.1400 కోట్లతో నెల్లూరులో విద్యుత్ పరిశ్రమ స్థాపిస్తున్నారన్నారు. నెల్లూరులో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని, కాబట్టి ఆయన నెల్లూరును వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి నెల్లూరు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. సుబ్బిరామి రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వం మెడికల్ కళాశాలకు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే లైనుకు అనుమతులు వెంటనే లభిస్తాయన్నారు.

మేధావులు ఓసారి ఆలోచించి సుబ్బిరామి రెడ్డికి ఓటు వేయాలని కోరారు. దురదృష్టవశాత్తూ నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతోందని, ఈసారి ఆనవాయితీని తిప్పికొట్టి ఓటింగ్ శాతాన్ని పెంచి సుబ్బిరామి రెడ్డికి అండగా నిలవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం వివేకానంద రెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణా రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చాట్ల నరసింహ రావు తదితరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు ఉప ఎన్నికలలో సానుభూతి కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నట్లు ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేయించారని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించ వద్దని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget