వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కన్ను ముఖ్యమంత్రి పీఠంపై
కాదా అంటే అవుననే ప్రచారం
జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసమే కాంగ్రెసు
పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ పేరుతో సొంతకుంపటి పెట్టుకున్న వైయస్ జగన్ కన్ను
ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం నుండి ప్రధానమంత్రి
పీఠం పైకి మరలిందని అంటున్నారు.
ఇటీవల ఆయన తన ఓదార్పు
యాత్రలో, ఉప ఎన్నికల ప్రచారంలో
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రాష్టంలో
294 సీట్లు గెలుస్తుందని, ఒకటి రెండు మినహా
నలభై పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ధీమా అంతా ఆయన
కన్ను ఢిల్లీ పీఠంపై పడటమే కారణమని అంటున్నారు.
రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటే
ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక
పాత్ర పోషించవచ్చునని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
ఆయన కన్ను ప్రధానమంత్రి పీఠంపై
పడిందనే ప్రచారంలో నిజమెంతో అబద్దమెంతో తెలియనప్పటికీ ఆయన వ్యాఖ్యలు మాత్రం
జాతీయ రాజకీయాల పట్ల ఆయనకు ఉన్న
ఆసక్తిని తెలియజేస్తున్నాయి.
వచ్చే
సాధారణ ఎన్నికలలో తన పార్టీ అత్యధిక
ఎంపీ స్థానాలు గెలుచుకుంటే అక్కడ తాను వ్యవసాయ
మంత్రి పదవిని అడుగుతానని మరిన్ని ఎక్కువ సీట్లు వస్తే తాను రైల్వే
శాఖను అడుగుతానని ఆయన ఇప్పటికే బహిరంగ
సమావేశాల్లో పలుమార్లు చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి పీఠం
కోసం పార్టీని వీడాడానే విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన లక్ష్యం ఢిల్లీ
పీఠం పైనే అంటున్నారు. రాష్ట్రంలో
నలభై స్థానాల వరకు వస్తే కేంద్రంలో
చక్రం తిప్పవచ్చునని కూడా ఆయన భావిస్తున్నారట.
తనకు
పదవి ఇవ్వకుండా పార్టీ వీడేలా చేసిన కాంగ్రెసుపై రివేంజ్
తీర్చుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు
మక్కువ చూపుతున్నారని కూడా అంటున్నారు. గత
పదిహేనేళ్లుగా కేంద్రంలో అలయెన్స్ రాజకీయాలే నడుస్తున్నాయి. భవిష్యత్తులోనూ జాతీయ స్థాయిలోని ఏ
పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆధిక్యత వచ్చే
అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో
ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలకు దిక్కు.
ఈ దిశలో ఆలోచించిన జగన్
రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లను కైవసం
చేసుకునేందుకు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారట.
జగన్ పార్టీలోని పలువురు నేతలు కూడా చూడండి
భవిష్యత్తులో తమ పార్టీ ఏ
స్థాయిలో ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారట.
కాంగ్రెసు పార్టీలోని పలువురు జగన్ కోవర్టులూ ఇదే
అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.
0 comments:
Post a Comment