మారుతి
సుజుకి ఇండియా అత్యధికంగా అమ్ముడువున్న హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్లో మరో కొత్త
వేరియంట్ను కంపెనీ నేడు
(సోమవారం) మార్కెట్లో విడుదల చేసింది. 'స్విఫ్ట్ ఆల్ఫా' పేరుతో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ స్పెషల్
లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ హ్యాచ్బ్యాక్‌లో స్విఫ్ట్ విఎక్స్-ఐ వేరియంట్లో లభించే
ఫీచర్లతో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం
కానున్నాయి.
మారుతి
సుజుకి నుండి అమ్ముడవుతున్న మొత్తం
కార్లలో పెట్రోల్ మోడళ్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ అదనపు ఫీచర్లు
కలిగిన కొత్త స్విఫ్ట్ ఆల్ఫా
పెట్రోల్ వేరియంట్ను విడుదల చేయటం
గమనార్హం. ఈ అప్గ్రేడెడ్
స్విఫ్ట్ ఆల్ఫా కేవలం పెట్రోల్
వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. కస్టమర్ల నుండి ఎలాంటి అదనపు
డబ్బులను వసూలు చేయకుండాన్ ఈ
అదనపు ఫీచర్లను జోడించిన వేరియంట్ను కంపెనీ అందిస్తోంది.
మారుతి
సుజుకి తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి
చూస్తుంటే, పడిపోతున్న పెట్రోల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు
కంపెనీ చేస్తున్న ఓ మార్కెటింగ్ ప్రయత్నంగా
తెలుస్తోంది.
మారుతి
సుజుకి కొత్త స్విఫ్ట్ ఆల్ఫా
స్పెషల్ ఎడిషన్ వేరియంట్లో లభించే ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.
* ఇంటీరియర్
స్టయిల్ కిట్
* బ్లూటూత్
కనెక్టివిటీ కూడా మ్యూజిక్ సిస్టమ్
* స్పీకర్లు
* డిజైనర్
ఫ్లోర్ మ్యాట్స్
* డోర్-సిల్ గార్డ్స్
* డోర్
విజర్స్
* బాడీ
కలర్ రియర్ రూఫ్ స్పాయిలర్
* మడ్-ఫ్లాప్స్
* సీట్
కవర్స్
కస్టమర్లు
ఈ అదనపు ఫీచర్లను బయటి
మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.8,000 వరకూ ఖర్చు అవుతుందని,
అయితే వీటిని తాము ఎలాంటి అధనపు
చార్జీలు వసూలు చేయకుండానే అందిస్తున్నామని
కంపెనీ పేర్కొంది.
0 comments:
Post a Comment