జపాన్
ఆటో దిగ్గజం మిత్సుబిషి దేశీయ విపణిలో అందిస్తున్న
లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్స్
యుటిలిటీ వెహికల్) మోంటెరోలో మరో సరికొత్త అప్డేటెడ్ వెర్షన్ కంపెనీ నేడు (సోమవారం) మార్కెట్లోకి
విడుదల చేసింది. సరికొత్త స్టయిల్తో అదనపు ఫీచర్లను
జోడించిన '2012 మోంటెరో' ఎస్యూవీని మిత్సుబిషి
మార్కెట్లోకి తీసుకు వచ్చింది.
కొత్త
2012 మోంటెరో ఎస్యూవీలో కొన్ని
చెప్పుకోదగిన మార్పులు చేర్పులను చేసింది. ముందువైపు రీ-స్టయిల్ చేయబడిన
ఫ్రంట్ బంపర్ అండ్ రియర్
బంపర్, క్రోమ్ ఫినిషింగ్ కలిగిన రేడియేటర్ గ్రిల్, లెథర్ సీట్స్, పవర్
విండోస్ స్విఛ్ ప్యానెల్, కొత్త బ్లూ కలర్
ఇంటీరియర్ ఇల్యుమినేషన్, అప్డెటెట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి విశిష్టమైన మార్పులతో
కొత్త 2012 మోంటెరో ఎస్యూవీ లభిస్తుంది.
అయితే,
ఈ 2012 మోంటెరో ఎస్యూవీ ఇంజన్లో మాత్రం ఎలాంటి
మార్పులు లేవు. ఇది శక్తివంతమైన
3.2 లీటర్ డీజిల్ ఇంజన్తో లభిస్తుంది.
ఇది గరిష్టంగా 200 బిహెచ్పిల శక్తిని విడుదల
చేస్తుంది. దీని ధరను రూ.40.50
లక్షలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా
నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
మారుతున్న
మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా మిత్సుబిషి
తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ
వస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల ఓ అప్గ్రేడెడ్ పాజెరో స్పోర్ట్ ఎస్యూవీని రూ.25.23
లక్ష ధరతో మరియు 2012 మిత్సుబిషి
అవుట్లాండర్ ఎస్యూవీని రూ.20.55
లక్షల ధరతో విడుదల చేసిన
సంగతి తెలిసిందే. అలాగే, సెడియా సెడాన్ ధరను కూడా తగ్గించి
రూ.7.99 లక్షలకే విడుదల చేసింది.
0 comments:
Post a Comment