వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు. మంగళవారం పార్టీ సమావేశంలో పలువురు కిందిస్థాయి నేతలు నారా లోకేష్
కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాలలోకి
తీసుకు రావాలని అధినేతకు సూచించారు. ఈ సమయంలో చంద్రబాబు
వారి సూచనలను మౌనంగానే విన్నారట. వారికి ఏ సమాధానం చెప్పలేదట.
అయితే
చంద్రబాబు మౌనం అంగీకారానికి సూచన
అని తెలుగు తమ్ముళ్లలో ఆనందం వ్యక్తమవుతోందట. అందుకు
వారు.. లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై చేసిన సూచనలకు గతంలో
స్పందించిన తీరుకు భిన్నంగా ఉండడమే అంటున్నారు. గతంలో ఎప్పుడైనా లోకేష్
ప్రస్తావన తీసుకు వస్తే.. తన తనయుడు వ్యాపారాలలో
బిజీగా ఉన్నారని, రాజకీయాలలోకి ఇప్పుడప్పుడే తీసుకు వచ్చే ప్రసక్తి లేదని
చెప్పేవారు.
గతంలో
చంద్రగిరి నియోజకవర్గానికి లోకేష్‌ను ఇంచార్జీగా నియమిస్తారనే
ప్రచారం జరిగినప్పుడు... అందుకు ధీటుగా జూనియర్ ఎన్టీఆర్ వర్గం యంగ్ హీరోను
కృష్ణా జిల్లా ఇంచార్జి అంటూ తెర పైకి
తీసుకు వచ్చింది. దీంతో చంద్రబాబు అప్పటికి
తగ్గారు. ఆ తర్వాత నుండి
లోకేష్ రాజకీయ ప్రవేశం అంశాన్ని పక్కన పెట్టారు. దాదాపు
మరో పదేళ్ల వరకు లోకేష్ ఆరంగేట్రాన్ని
పక్కన పెట్టాలని భావించారట.
అయితే
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే బాబు
నిర్ణయంలో మార్పుకు కారణమని అంటున్నారు. ఉప ఎన్నికలలో కడప
పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిన
విషయం తెలిసిందే. అరెస్టు తదితర సానుభూతి కారణాలతో
పాటు జగన్‌కు యువకుడు
అనే అంశం కూడా తోడ్పడిందని
అంటున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలలో ఉన్న నేతల పట్ల
ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, వారు ప్రత్యామ్నాయాల వైపు
దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.
అందుకే
ఉప ఎన్నికలలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టికరిపించి జగన్ పార్టీకి ప్రజలు
జై కొట్టారని అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన
చంద్రబాబు పార్టీలో కొత్త ఉత్సాహం కోసం
కొత్త నీరును తీసుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే నందమూరి - నారా కుటుంబాల మధ్య
విభేదాల ప్రచారం నేపథ్యంలో తన తర్వాత నాయకత్వ
లేమి ఏమీ లేదని కార్యకర్తలలో
విశ్వాసం కలిగించేందుకు బాబు సమాయత్తమవుతున్నారని అంటున్నారు.
అందుకే
లోకేష్ రాజకీయ ఆరంగేట్రపై గతానికి భిన్నంగా చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని
అంటున్నారు. 2014 సాధారణ ఎన్నికలపై దృష్టి సారించిన చంద్రబాబు అ లోగా తన
తనయుడు నారా లోకేష్‌ను
రాజకీయ ఆరంగేట్రం చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
0 comments:
Post a Comment