హైదరాబాద్:
సిబిఐ జెడి కాల్ లిస్ట్
వ్యవహారంలో ఐబిఎం ఉద్యోగిని, లీడ్
ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాలకు పోలీసు శాఖ రక్షణ కల్పించింది.
ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును భద్రత
కోసం కేటాయించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తన కాల్ జాబితాను
బహిర్గతం చేసిన నేపథ్యంలో తనకు
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చంద్రబాలు ఇటీవల మానవ హక్కుల
సంఘంలో ఫిర్యాదు చేశారు.
దీంతో
మానవ హక్కుల సంఘం ఆమెకు భద్రత
కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశించింది. వారి
ఆదేశాల మేరకు భద్రత చంద్రబాలకు
భద్రత కల్పించామని కూకట్‌పల్లి ఎసిపి
తెలిపారు. సిబిఐ జెడి లక్ష్మీ
నారాయణకు కూడా ఇటీవల భద్రత
పెంచిన విషయం తెలిసిందే. తన
కాల్ లిస్ట్ ఎవరో సేకరించారన్న సమాచారం
తెలుసుకున్న జెడి అప్పటి వరకు
తాను ఉపయోగిస్తున్న రెండు నెంబర్‌లను
వినియోగించడం మానేశారు. అధికారుల అనుమతితో మరో నెంబర్ తీసుకున్నా,
దానిని ఎవరికీ ఇవ్వలేదు.
తన కాల్ లిస్ట్ సేకరించారన్న
సమాచారం అందుకున్న తనపై ఎవరో నిఘా
పెట్టారన్న సమాచారాన్ని ఢిల్లీలోన కేంద్ర కార్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఆ కారణంగానే అధికారులు
జెడికి భద్రత పెంచాలని రాష్ట్ర
ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా
తన కాల్ లిస్ట్ బహిర్గతంపై
చంద్రబాల సైబరాబాద్ క్రైం పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు
చేసిన విషయం తెలిసిందే.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎసిబి
స్థాయి అధికారితో విచారణ జరిపిస్తున్నారు. సిబిఐ జెడి లక్ష్మీ
నారాయణ కూడా తన కాల్
లిస్ట్‌ను బయట పెట్టడంపై
ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఏ క్షణంలోనైనా నిందితులను
అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని
అంటున్నారు.
0 comments:
Post a Comment