హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల ప్రకటించిన బిసి డిక్లరేషన్ చూసి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ అయిందని తెలుగు యువత అధ్యక్షుడు రవిచంద్ర యాదవ్ సోమవారం అన్నారు. రవిచంద్ర ఓ ప్రకటనలో వైయస్సార్ కాంగ్రెసుపై మండిపడ్డారు. జగన్ తన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాయించాల్సిన లేఖను చంద్రబాబుకు రాయించారని ఎద్దేవా చేశారు.
జైలులో ఉన్న జగన్ అక్కడే స్క్రిప్ట్ రచిస్తున్నారని, ములాఖత్‌లకు వస్తున్న తమ పార్టీ నేతలతో తన వ్యూహరచనను బయటకు పంపిస్తున్నారని, దానిని వైయస్ విజయమ్మ ఆచరణలో పెడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాసిన లేఖ కూడా అందులో భాగమే అన్నారు. మన దేశంలో జైలు నుంచి నడిచే పార్టీ కూడా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. బిసిలలో ఎన్ని కులాలు ఉన్నాయో.. వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలియని వైయస్ విజయమ్మ బిసిలకు వంద సీట్లు అంటూ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.
తాము సంవత్సరం ముందే వంద సీట్లు ఇస్తామని ప్రకటించామని, బిసిలపై మీకు ప్రేముంటే బిసిలకు టికెట్లు ఇవ్వండని సూచన చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో బిసిలకు పదవులే ఇవ్వలేదు ఇక అసెంబ్లీకి పంపుతారా అని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ విమర్శించింది. పార్టీ పదవుల్లోనే బిసిలకు ప్రాధాన్యతనివ్వని వైయస్సార్ కాంగ్రెసు అసెంబ్లీకి పంపుతుందంటే ఎవరూ నమ్మరన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్న బిసి వర్గాలకు చెందిన అజయ్, నవీన్ గౌడ్‌లను ఆ పదవుల నుంచి తొలగించినప్పుడు వైయస్ విజయమ్మకు బిసిలపై ప్రేమ ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లలో 4.5 శాతం ముస్లింలకు కేటాయించి... బిసిలు-ముస్లింల మధ్య దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అగాధం సృష్టించారన్నారు.

0 comments:
Post a Comment