జనవరిలో జరిగిన 11వ ఢిల్లీ ఆటో
ఎక్స్పోలో హీరో మోటటోకార్ప్
(గతంలో హీరో హోండా) ప్రదర్శించిన
110సీసీ స్కూటర్ "హీరో మాస్ట్రో"ను
మార్కెట్లోకి తీసువచ్చింది. దేశవ్యాప్తంగా విడతల వారీగా కంపెనీ
ఈ మోడల్ను వివిధ
రాష్ట్ర మార్కెట్లలో విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవలే మాస్ట్రో స్కూటర్ను గోవా మార్కెట్లో
కూడా విడుదల చేసింది. గోవాలో ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.48,280 గానూ,
ఆన్-రోడ్ ధర రూ.52,872
గానూ ఉంది.
ప్రస్తుతం
హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో ఒకేఒక్క
స్కూటర్ (ప్లెజర్)ను మాత్రమే అందిస్తోంది.
మాస్ట్రో రాకతో హీరో స్కూటర్
ప్రోడక్ట్ఫోలియో రెండుకు పెరిగింది. హోండా అందిస్తున్న యాక్టివా
స్కూటర్ను సవాల్ చేస్తూ
హీరో తమ మాస్ట్రో స్కూటర్ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి
హోండా యాక్టివా ఫ్లాట్ఫామ్ ఆధారంగానే మాస్ట్రో
స్కూటర్ను తయారు చేయటం
జరిగింది. సింపుల్గా చెప్పాలంటే హోండా
యాక్టివాకు రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్.
హీరో
మాస్ట్రోలో 109సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఓహెచ్సి ఇంజన్ ఉపయోగించారు.
(హోండా యాక్టివాలో కూడా ఇదే ఇంజన్ను ఉపయోగించారు). ఇది
7,500 ఆర్పిఎమ్ వద్ద 8.2 పిఎస్‌ల గరిష్ట శక్తిని,
5,500 ఆర్పిఎమ్ వద్ద 9.10 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది.
హీరో మాస్ట్రో స్కూటర్ 1,240 మి.మీ. వీల్బేస్ను కలిగి
ఉండి, 155 మి.మీ. గ్రౌండ్
క్లియరెన్స్ను కలిగి ఉంటుంది.
దీని
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్కు సుమారు 60 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ
పేర్కొంది. హీరో మాస్ట్రో స్కూటర్
పాంథర్ బ్లాక్, పెరల్ వైట్, బ్లేజింగ్
రెడ్, ఎలక్ట్రిక్ బ్లూ, ఫోర్స్ సిల్వర్,
హార్వెస్ట్ గ్రీన్ అనే ఆరు ఆకర్షనీయమైన
రంగుల్లో లభ్యమవుతుంది.
హీరో
మాస్ట్రో స్కూటర్లోని కీలక ఫీచర్లు:
* శక్తివంతమైన
109సీసీ ఇంజన్.
* బ్రేక్
వేసినప్పుడు స్కూటర్ జారిపోకుండా ఉండేందుకు వెనుక బ్రేక్ నొక్కినప్పుడు
ఒకేసారి ఫ్రంట్ అండ్ రియర్ బ్రేకులు
పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన "కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్".
* సర్వీస్
డ్యూ ఇండికేటర్ (తర్వాతి సర్వీసింగ్ సమయాన్ని సూచించే ఇండికేటర్)తో కూడిన డిజిటల్
అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్.
ఈ ఫీచర్ స్కూటర్లలోనే మొట్టమొదటిసారిగా
పరిచయం చేయబడింది.
* అయస్కాంతం
(మ్యాగ్నిటక్) హెడ్ అండ్ షట్టర్తో కూడిన మల్టీ-లివర్ కీ.
* రాత్రివేళల్లో
రోడ్డుపై చక్కటిన కాంతినిచ్చేలా ఏర్పాటు చేసిన మల్టీ ఫోకల్
రిఫ్లెక్టర్ హెడ్ల్యాంప్, స్ట్రైకింగ్
ఫ్రంట్ విజర్.
* ఇండికేటర్లు,
టెయిల్ ల్యాంప్ ఒకేదానిలో ఉండేలా డిజైన్ చేసిన కంబైన్డ్ టెయిల్
ల్యాంప్ విత్ ఇండికేటర్స్.
* సౌకర్యవంతమైన
ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన
విశాలమైన సీట్.
* స్కూటర్
బాడీ కలర్లోనే ఉండే
సైడ్ మిర్రర్స్.
* సీటుకు
చివరి భాగంలో అమర్చిన స్టయిలిష్ రియర్ గ్రాబ్ రెయిల్స్.
* మెయింటినెస్స్
అవరసం లేని బ్యాటరీ.
* విస్కౌస్
పేపర్ ప్లేటెడ్ ఎయిర్ఫిల్టర్.
* విశాలమైన
స్టోరేజ్ స్పేస్.
0 comments:
Post a Comment