నితిన్
..పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న
విషయం తెలిసిందే. దాంతో తన మొన్న
శుక్రవారం జరుపుకున్న పుట్టిన రోజుకి బర్తడే కేకుపై పవన్ బొమ్మ పెట్టుకున్నారు.
దానితో పాటు హృతిక్ రోషన్
ఫోటో కూడా ఉంది. ఈ
కేకుని ప్రత్యేకంగా నితిన్ స్నేహితుడు చేయించి గిప్ట్ గా ఇచ్చి నితిన్
ని ఆనందపరిచాడు. అలాగే నితిన్ ఇష్క్
ఆడియో పంక్షన్ కి పవన్ కళ్యాణ్
వచ్చి ఆనందపరిచాడు. దానికితోడు ఇష్క్ చాలా గ్యాప్
తర్వాత నితిన్ కి హిట్టు ఇచ్చింది.
దాంతో నితిన్ ఇప్పుడు పవన్ ని తన
లక్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం
నితిన్ ..రామ్ గోపాల్ వర్మ
దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అలాగే ..తాను నందినిరెడ్డి, సురేందర్రెడ్డితో కూడా సినిమా చేసే
అవకాశాలున్నాయని అన్నారు.
అలాగే
మల్టీస్టారర్ చిత్రం జనవరిలో ఉంటుంది. అది నా వయస్సుఉన్న
హీరో తో. ప్రస్తుతం బెల్లంకొండ
సురేస్ నిర్మాతగా సినిమాలు చేయబోతున్నాను. ఇవికాకుండా 'కాటన్కింగ్' అనే
ముంబైకు చెందిన కంపెనీకి మోడల్గా వ్యవహరిస్తున్నాను.
హిందీలో ఇష్క్ రీమేక్చేస్తున్నారు. అందులో నేను నటించడంలేదు. తమిళ,
కన్నడలోకూడా రీమేక్ చేయాలని నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment