ప్రభుదేవా-నయన తార మధ్య
రసవత్తరంగా సాగిన ప్రేమాయణం దాదాపుగా
పెళ్లి వరకు వచ్చి బ్రేకప్
అయిన సంగతి తెలిసిందే. వీళ్ల
ప్రేమ బ్రేకప్ కావడానికి ముందు చాలా ఆసక్తికర
విషయాలు చోటు చేసుకున్నాయి. నయనతార,
ప్రభుదేవా ప్రేమాయణం బయట ప్రపంచానికి ఎలా
తెలిసిందో తెలుసా...? నయనత చేతిపై వేయించుకున్న
ప్రభు అనే పచ్చబొట్టు కారణంగానే.
ఆ పచ్చబొట్టు మీడియా కంట పడటంతో....తీగలాగితే
డొంకంతా కదిలి వీరి ప్రేమ
వ్యవహారం బట్టబయలైంది. అనంతరం ప్రభుదేవా తన భార్య రమలత్కు విడాకులు ఇవ్వడం,
నయనతార-ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అనుకోని
కారణాలతో ఇద్దరి మధ్య బంధం తెగింది.
ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాన్ని మరిచి
పోవడానికి నయనతార మళ్లీ సినిమాలపై దృష్టి
మళ్లించింది.
ప్రభుదేవా
నయనను మోసం చేశాడని, అతని
ప్రేమలో నిజాయితీ లేదని, డబ్బు కోసమే ఆమెను
ప్రేమ పేరుతో వంచించాడని ఆమె కుటుంబ సభ్యులు
గతంలో మీడియాకు వెల్లడించగా...ఇటీవల నయనతార కూడా
తమిళ ఛానల్ తో మాట్లాడుతూ
తమ మధ్య బంధం తెగిందనే
విషయాన్ని స్పష్టం చేసింది. తాను అతని ప్రేమ
కోసం ఎన్నో త్యాగాలు చేశాను,
కానీ అతని వద్ద తన
ప్రేమకు విలువ లేదు, అందుకే
విడిపోవాల్సి వచ్చిందని చెప్పంది.
అయితే
నయనతార తన చేతిపై ప్రభుదేవా
పేరుతో పొడిపించుకున్న పచ్చబొట్టును తొలగించుకోవాలని నిర్ణయించుకుందని, ఇందుకోసం ప్లాస్టిక్ సర్జీరీని ఆశ్రయిస్తుందని ఆ మధ్య వార్తలు
వచ్చాయి. అయితే ఈ వార్తలను
నయన తాజాగా ఖండించింది. తాను ఆ పచ్చబొట్టు
తొలగించుకోవడం లేదని స్పష్టం చేసింది.
టాటూ
తొలగించుకోనని నయన తార ప్రకటించిన
నేపథ్యంలో అనేక అనుమానాలు తలెత్తున్నాయి.
మరి నయనతార ఆ టాటూను ఎంత
కాలం అలా ఉంచుకుంటుంది? ఇప్పటికే
ఇద్దరితో ప్రేమ విఫయం అయిన
ఆమె....ఏ మగాడికి తన
జీవితంలో స్థానం ఇవ్వదా? కొందరు హీరోయిన్లలా ఒంటరిగానే ఉండి పోతుందా? ఒక
వేళ వేరే ఎవరైనా ఆమె
జీవితంలోకి వస్తే ఆమె చేతిపై
ఆ టాటూను చూస్తూ ఎలా భరిస్తాడు? లేక
మళ్లీ ఎప్పటికైనా నయన ప్రభుదేవాతో కలుస్తుందా?
అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
0 comments:
Post a Comment