హైదరాబాద్:
తాను ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తే తన సీటుపై ఎవరు
కన్నేశారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం
అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా కిరణ్
కుమార్ రెడ్డియే కొనసాగుతారని స్పష్టం చేశారు. కిరణ్కు తనకు
మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలు
సహజమేనని చెప్పారు. వ్యక్తులు తల్చుకుంటే పదవులు మారవని చెప్పారు.
ఎసిబి
తీరును తాను సమర్థించను వ్యతిరేకించనని
చెప్పారు. తనను ఎవరో ముఖ్యమంత్రి
టార్గెట్ చేసుకున్నారనేది అవాస్తవమన్నారు. అయినా తనను ఎవరైనా
అంటే తాను వ్యక్తిగతంగా ఆలోచన
చేయనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను బాధ్యతగా ఆలోచిస్తానని
అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాను లేక రాయలేదని
చెప్పారు.
కార్యకర్తలకు
మనోధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు
తీసుకు పోతాని చెప్పారు. మద్యం వ్యాపారంతో తనకు
ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నా
సన్నిహితులు, బంధువులకు పరోక్షంగా మద్యం వ్యాపారాలతో సంబంధం
ఉందని చెప్పారు. తాను సిఎం సీటుపై
కన్నేస్తే, తన సీటుపై ఎవరు
వేశారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
కాగా
పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి
కిరణ్కు అధిష్టానం నుండి
పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బొత్స
మంగళవారం సాయంత్రం, కిరణ్ బుధవారం ఉదయం
ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది.
0 comments:
Post a Comment