హైదరాబాద్:
అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) జాయింట్
డైరెక్టర్ శ్రీనివాస రెడ్డికి బదలీ మెమో జారీ
అయింది. సాధారణ పరిపాలన శాఖ ఆయనకు పోలీసుల
సహాయంతో బదలీ మెమో జారీ
చేసింది. వెంటనే కొత్త బాధ్యతలు చేపట్టాలని
సిఎస్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై
శ్రీనివాస్ రెడ్డి దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే
రెండు రోజుల క్రితం శ్రీనివాస
రెడ్డిని ప్రభుత్వం ఆయనను బదలీ చేస్తున్నట్లు
అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దానిని
ఆయన తిరస్కరించారు. ఎసిబి జెడి కూడా
ఆయనను రివీల్ చేసేందుకు ససేమీరా అన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసుల సహాయంతో జెఏడి బదలీ మెమో
జారీ చేసింది. శ్రీనివాస్ రెడ్డిని బదలీ చేయవద్దన్న ఎసిబి
జెడి లేఖను ప్రభుత్వం తిరస్కరించింది.
విజయనగరం
జిల్లా మద్యం సిండికేట్లపై హైకోర్టుకు
నివేదిక సమర్పించాల్సి ఉండటంతో జెడి శ్రీనివాస్ రెడ్డి
దానిపై తుది కసరత్తు చేస్తున్నారు.
ఇందుకోసం ఆయన సెలవు దినమైనప్పటికీ
గురువారం రోజూ పని చేశారు.
కాగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణను టార్గెట్ చేసుకున్న కారణంగానే ఆయనను బదలీ చేస్తున్నారనే
విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు
ఎసిబి జెడి శ్రీనివాస రెడ్డికి
బదలీ మెమోలు పంపించినట్లు మీడియాలో వస్తున్న వార్తలను సాధారణ పరిపాలన సంఘం ఖండించినట్లుగా కూడా
తెలుస్తోంది. తాము శ్రీనివాస రెడ్డికి
ఎలాంటి బదలీ మెమోలు పంపలేదని
తెలిపిందట. మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని చెబుతున్నారట. శ్రీనివాస్ రెడ్డి బదలిపై అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. బదలీ నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రిని
మధ్యాహ్నం అఖిలపక్షం నేతలు కలవనున్నారు.
0 comments:
Post a Comment