విజయవాడ:
: రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా కిరణ్
కుమార్ రెడ్డి కొనసాగుతారని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి
అనుమానాలకు తావులేదని చెప్పారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి
కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య
ఎలాంటి విభేదాలు లేవన్నారు. అవన్నీ కేవలం మీడియా సృష్టేనని
చెప్పారు. సమర్థత వల్లే ఎసిబి జాయింట్
డైరెక్టర్ శ్రీనివాస రెడ్డికి శాఖాపరమైన పదోన్నతి లభించిందని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు
అర్ధంలేని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కోర్టు
ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో.. జరుగుతున్న విచారణలో వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలను బట్టే చార్జిషీట్లో
పలువురి పేర్లు ఉన్నాయన్నారు. కేసు విచారణలో కాంగ్రెస్
పార్టీకి సంబంధం లేదని చెప్పారు.
కాగా
ఆయన చందర్లపాడు మండలంలో గుర్రం ఎక్కి హల్ చల్
చేశారు. మండలంలో ఆయన పలు అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు
ఆయనను గుర్రమెక్కించారు. స్వయంగానే ఆయనే దానిని కొంతదూరం
నడిపారు. ఈ సందర్భంగా ఆయన
ప్రజల ఆదరాభిమానాలు ఉంటే భవిష్యత్తులోనూ గెలుపు
గుర్రం తనదే అన్నారు.
0 comments:
Post a Comment