విజయవాడ:
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి
స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి
కొండా సురేఖ మంగళవారం కృష్ణా
జిల్లాలో అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో అన్ని
నియోజకవర్గాల్లో జగన్ పార్టీ అభ్యర్థులే
ఘన విజయం సాధిస్తారని ఆమె
చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ధరావత్తు గల్లంతు కావడం ఖాయమని ఆమె
అన్నారు.
కొండా
సురేఖకృష్ణా జిల్లోలని కైకలూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడారు. అయితే ఆమె పర్యటనకు
సమైక్యాంధ్ర సెగ తగిలింది. కాంగ్రెసు
పార్టీ కార్యకర్తలు ఆమె పర్యటనకు నిరసన
తెలిపారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో
పలువురు కార్యకర్తలు సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని అందుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ శాసనమండలి సభ్యురాలు
కమ్మిలి విఠల్ రావు మాట్లాడారు.
కొండా సురేఖ కైకలూరు పర్యటనను
బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు.
సీమాంధ్రకు చెందిన నాయకుల శుభకార్యక్రమాలు, సినిమా షూటింగులను తెలంగాణవాదులు అడ్డుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన
గుర్తు చేశారు.
ఆమె రాజకీయ పర్యటన చేస్తున్నా తాము మౌనంగానే శాంతియుతంగా
ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నామని
చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సంయుక్త కార్యదర్శి
బొర్రా చలమయ్య మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ కంటే ఎక్కువ సెంటిమెంటు
ఉందని చెప్పారు. కాగా పోలీసులు ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ కొద్ది సేపు
ట్రాఫిక్ జాం అయింది.
0 comments:
Post a Comment