న్యూఢిల్లీ:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు మారాలని
ప్రజలు కోరుకుంటున్నారని చేనేత, జౌళీ శాఖ మాజీ
మంత్రి శంకర రావు మంగళవారం
అన్నారు. రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం కెప్టెన్లు మారాల్సి ఉందన్నారు. అలా అయితేనే కాంగ్రెసు
2014 ఎన్నికల్లో గెలుస్తుందని అన్నారు. తరుచూ ముఖ్యమంత్రులను మారుస్తారన్న
చెడ్డ పేరు అధిష్టానానికి రాకుండా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే
స్వచ్ఛందంగా రాజీనామా చేయాలన్నారు.
కాంగ్రెసుకు
బలమైన ఓటు బ్యాంకు ఉందని
ఆయన చెప్పారు. రాష్ట్రంలో 26 సీట్లు వచ్చినప్పుడు కూడా ముప్పై మూడు
శాతం ఓట్లు వచ్చాయని గుర్తు
చేశారు. ఇదంతా దివంగత ప్రధాని
జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ
కుటుంబాల త్యాగఫలితమేనని ఆయన చెప్పారు. ప్రదేశ్
కాంగ్రెసు కమిటి, ముఖ్యమంత్రుల వల్ల ఓట్లు కేవలం
ఒకటి, రెండు శాతం మాత్రమే
పెరుగుతాయని చెప్పారు.
గాలివాటంగా
వచ్చిన ఈ ఇద్దర్ని ప్రజలు
సహించే పరిస్థితి లేదన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో అంతర్భాగమేనని చెప్పారు. అందరూ ఏఐసిసి అధ్యక్షురాలు
సోనియా గాంధీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని
చెప్పారు.
కాగా
శంకర రావు మంత్రివర్గంలో ఉంటూనే
నిత్యం సహచర మంత్రులపై ఆరోపణలు
చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్
చేసుకున్నారు. దీంతో కిరణ్ అధిష్టానాన్ని
ఒప్పించి ఆయనను మంత్రివర్గం నుండి
బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment