వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మికి పొలిటికల్ ట్రయినింగ్ ఇప్పిస్తున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ
విచారణ జరుగుతున్న విషయం
తెలిసిందే. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే తొలి
ఛార్జీషీటును గత శనివారం కోర్టులో దాఖలు చేసింది. మరో ఛార్జీషీటును మంగళవారం దాఖలు చేసేందుకు సిద్దమౌతోంది.
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దూకుడుగా వెళుతుండటంతో ఏ క్షణంలోనైనా యువనేతను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎ-1 నిందితుడిగా పేర్కొన్న జగన్ను సిబిఐ
అరెస్టు చేయవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ ఆందోళన ఉందట. దీంతో ఒకవేళ
జగన్ అరెస్టయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు వైయస్
విజయమ్మను సంసిద్ధం చేయాలని ఆ పార్టీ వర్గాలు భావించాయట.
ఇందుకోసం ఆమెకు పొలిటికల్ ట్రయినింగ్ ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ అరెస్టయినా పార్టీని ఏకతాటి పైన
నడుపుతూ, ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆమెకు ట్రయినింగ్ ఇప్పిస్తున్నారని అంటున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో ఆమెకు ఈ ట్రయినింగ్ ఇప్పిస్తున్నారట. సమావేశాల్లో ఎలా
మాట్లాడాలి? బహిరంగ సభల్లో మాట్లాడాల్సిన తీరు, ప్రజలతో ఎలా నడుచుకోవాలి? తదితర
అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారని అంటున్నారు.
దీంతో అనుకోని పరిస్థితులు ఎదురైతే విజయమ్మ జగన్
తరహా ఓదార్పు యాత్రలు నిర్వహిస్తారా? తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ప్రభావితం చేస్తారా? అనే చర్చ
జరుగుతోందంట. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె బయటకి
వచ్చిన సందర్భాలు లేవు.
కానీ ఇప్పుడు ఆమె
తన నియోజకవర్గం పులివెందుల ప్రజలతో పూర్తిగా మమేకం
అవుతాన్నారట.
0 comments:
Post a Comment