ఒంగోలు:
రాష్ట్రంలో దుష్టులకు, దుర్మార్గులకు ఊరూరా విగ్రహాలు వెలుస్తున్నాయని
తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు
నందమూరి హరికృష్ణ ఆదివారం ప్రకాశం జిల్లాలో అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్,
అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు
మాత్రం రక్షణ కరువైందని ఆవేదన
వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో
మళ్లీ అంజయ్య కాలం నాటి పరిస్థితులు
పునరావృతం కాబోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం
చేశారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఢిల్లీలో తెలుగువారి
ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే
రోజులు తెలుగుదేశం పార్టీవేనని ఆయన ఆశాభావం వ్యక్తం
చేశారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రజలు
టిడిపికి పట్టం
కట్టాలని
ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల
కోసం ఉద్యమాలను చేస్తున్న పార్టీ టిడిపియే అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం
1983 నుండి టిడిపి నిలబడిందన్నారు. పేద, బడుగు, బలహీన
వర్గాల వారి పక్షాన తెలుగుదేశం
మొదటి నుండి పోరాటం చేస్తుందన్నారు.
ఆడపడుచులకు గౌరవమిస్తేనే ఆ పార్టీ బాగుంటుందన్నారు.
టిడిపి ఎప్పుడూ ఆడపడుచులకు తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
కాగా
అంతకుముందు కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్రంలో నాలుగో కృష్ణుడి కోసం ప్రయత్నాలు చేస్తోందని
ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు
పార్టీ ఓ డ్రామా కంపెనీలా
తయారయిందని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలు ఆ దిశగా ప్రయత్నాలు
చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి
వ్యవసాయం గురించే ఏమాత్రం తెలియదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని
చాలామంది మంత్రులకు వారి వారి శాఖల
పైనే పూర్తి అవగాహన లేదన్నారు.
0 comments:
Post a Comment