తాను
నగ్నంగా నటించిన దృశ్యంతో పాటు మొత్తం సినిమా
చూడటానికి తన కూతురు మియా
(11), కొడుకు జో (8)లను అనుమతిస్తానంటోంది
కేట్ విన్స్లెట్. 'టైటానిక్'
చిత్రం 3డి వెర్షన్ విడుదల
సందర్భంగా హీరోయిన్ కేట్ విన్స్లెట్
అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంది. ఆ సినిమాలో ఈమెకు
జంటగా నటించిన లియొనార్డొ డికాప్రియో కాస్త లావయ్యాడని, అయితే
తాను మాత్రం మరింత నాజూగ్గా తయారయ్యానని
పేర్కొంది.'డే బ్రేక్' అనే
టెలివిజన్ షోలో ఈ విషయాలన్నీ
చెప్పింది.
అలాగే...మేం కాస్త పెద్దవాళ్ళమయ్యాం.
లియోకు ఇప్పుడు 37 ఏళ్ళు, నాకు 36. అప్పుడు లియోనార్డో కు 22, నాకు 21. ఈ యంగ్ ఏజ్
లో ఈ సినిమా తీశారు
అంది. ఇక టైటానిక్ నౌక
మునిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను 3డి
ఫార్మాట్లో మరోమారు విడుదల
చేస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం ఇక్కడ
విడుదల అవుతోంది. ఈ చిత్రం మరోసారి
చూడటానికి ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.
లియోనార్డో
డికాప్రియో, కేట్ విన్స్లెట్
కాంబినేషన్ లో వచ్చిన 'టైటానిక్'మళ్ళీ మరోసారి మన
మనస్సులను దోచుకోవటానికి ముస్తాబవుతోంది. ఏప్రియల్ మొదటి వారంలో ఈ
చిత్రం విడుదల చేయనున్నారు. ఈనాటి టెక్నాలిజీకి అణుగుణంగా
అంటే త్రీడిలో రూపుదిద్దుకుంటోంది. 1997లో ప్రేక్షకుల ముందుకు
వచ్చిన ఈ చిత్రం ఆస్కార్
అవార్డుల పంట పండించుకొంది. 'అవతార్'
తరవాత జేమ్స్ మళ్లీ తన 'టైటానిక్'కే మెరుగులు దిద్దారు.
మూడు సంవత్సరాలు కష్టపడి ఆ ప్రేమకథను త్రీడీలో
ఆవిష్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్
15 న విడుదల కానుంది.
ట్వంటీయత్
సెంచరీ ఫాక్స్ సంస్థ 'టైటానిక్ త్రీడీ' చిత్రాన్ని మన దేశంలో విడుదల
చేయనుంది. ఆ సంస్థ ప్రతినిధి
మాట్లాడుతూ ''టైటానిక్ని త్రీడీలో చూడడం
ఓ మర్చిపోలేని అనుభూతి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. మరోసారి జేమ్స్ మాయ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది''అన్నారు. అసాధారణ ప్రేమకథాచిత్రంగా, దృశ్యకావ్యంగా ప్రశంసలందుకున్న 'టైటానిక్' చిత్రం ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్వంటీయత్
సెంచరీ ఫాక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. 'టైటానిక్' చిత్రం 3డి వెర్షన్ రూపకల్పన
2009లో మొదలైంది. 2012 ఏప్రియల్ 15కల్లా టైటానిక్ ఓడ
మునిగిపోయి వందేళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈ
ప్రేమకథను మరోసారి త్రీడి ఫార్మెట్ లో ఆవిష్కరించనున్నారన్నమాట.
0 comments:
Post a Comment