హైదరాబాద్:
రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో తమకు మంచి రిలేషన్షిప్ ఉండేదని హీరో
రాజశేఖర్, నిర్మాత, దర్శకురాలు జీవిత ఆదివారం ఎబిఎన్
ఆంధ్రజ్యోతి ఛానల్కు ఇచ్చిన
ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. కానీ క్రమంగా ఆయన
తమ పట్ల నిర్లక్ష్యం వహించడం
తమకు బాధ కలిగించిందని చెప్పారు.
ఓసారి ఒక ఫంక్షన్కు
పిలిస్తే వెళ్లామని కానీ అక్కడ తమను
ఎవరూ పట్టించుకోలేదన్నారు.
స్వర్గీయ
నందమూరి తారక రామారావుతో ఉన్న
సాన్నిహిత్యం కారణంగానే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు.
ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అప్పుడు చేసింది పెద్ద తప్పేమీ కాదన్నారు.
ఇప్పుడున్న వారు చేసిందే అప్పుడు
ఆమె చేసిందన్నారు. ఆమె అందంగా లేదని,
అదే ఆమెకు మైనస్ అన్నారు.
జయప్రద, జయలలితల వలె అందంగా ఉంటే
ఆమె సిఎం అయ్యే వారన్నారు.
ఇప్పటి
వరకు తాము జాయిన్ అయింది
కేవలం కాంగ్రెసు పార్టీలోనే అని చెప్పారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తమను పిలిచారన్నారు. అంతకుముందు
రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పటికీ తాము తిరస్కరించామన్నారు.
చిరంజీవి
పార్టీ పెట్టాక మరీ అడగటంతో వచ్చామన్నారు.
వైయస్ చాలా నైస్ పర్సన్
అని, ఆయన ఎప్పుడూ తమను
చిన్నచూపు చూడలేదని చెప్పారు. ప్రస్తుతం తాము తమ వల్ల
అయిన మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు
చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి మెడికల్ రెవెల్యూషన్
తేవాలన్నది తన లక్ష్యమని రాజశేఖర్
చెప్పారు.
0 comments:
Post a Comment