హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందే తాము బయటకు
వచ్చామని సినీ హీరో రాజశేఖర్,
ఆయన సతీమణి జీవిత ఆదివారం ఎబిఎన్
ఆంధ్రజ్యోతి ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. జగన్ కాంగ్రెసు పార్టీ
వీడాక ఆ పార్టీ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు మాకు
బాగా ఫీడ్ బ్యాక్ చేయడంతో
అందరిలాగే తాము జగన్ వెంట
వెళ్లామన్నారు.
చిరంజీవి,
నాగార్జున వంటి హీరోల తనయులు
హీరోలు అవుతున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
తనయుడిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని
కోరుకోవడంలో తప్పు లేదని తాము
భావించామన్నారు. ఆ ఫీలింగ్తో
ఆయనతో వెళ్లామని చెప్పారు. ఆ తర్వాత కొద్ది
రోజులు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ విజయవాడ దీక్ష
సమయంలో తమను అంబటి రమ్మని
పిలిస్తే వెళ్లామన్నారు.
ప్రెస్
మీట్ పెట్టి కాంగ్రెసు, చిరంజీవిపై విమర్శలు చేసే వరకు వదల్లేదన్నారు.
జగన్ సంపాదనపై నేతలు ఈజీగా మాట్లాడేశారన్నారు.
జగన్ అవినీతితో బాగా డబ్బు సంపాదిస్తున్నారని
వస్తున్న విమర్శలపై తాను పార్టీలోని పలువురిని
అప్పుడే ప్రశ్నించానన్నారు. అదే నిజమైతే మేం
పార్టీలో ఉన్నందుకు సమాధానం చెప్పవలసి వస్తుంది కదా అని వారిని
తాను ప్రశ్నించానని రాజశేఖర్ చెప్పారు.
జగన్
తన అంత డబ్బు ఉంటే
ఓదార్పు యాత్రలు నిర్వహించే బదులు రైతులకు ఇవ్వవచ్చు
కదా అని అన్నారు. జగన్
తనంతట తానే అవినీతిపరుడినని ప్రూవ్
చేసుకున్నారన్నారు. విజయవాడ దీక్షలో మొదట తమను బాగానే
రిసీవ్ చేసుకున్నారని, కానీ ఆ తర్వాత
మాత్రం తమను టీవీల్లో ఇంటర్య్వూలని
చెప్పి హైదరాబాద్ పంపించారన్నారు. ఆ తర్వాత పరిణామాలు
తమను బాధించాయన్నారు.
0 comments:
Post a Comment