తిరుపతి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రానున్న ఉప ఎన్నికలలో గెలిస్తే
రాష్ట్రం ముక్కలవుతుందని చిన్న నీటి పారుదల
శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం
అన్నారు. ఆదివారం ముత్యాలరెడ్డిపల్లిలో పంగులూరు సీతమ్మ నిత్యాన్నదాన సత్రానికి తమిళనాడు గవర్నర్, మన రాష్ట్ర మాజీ
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శంకుస్థాపన చేసారు.
ఈ కార్యక్రమంలో టిజి వెంకటేష్ పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడారు. జగన్కు సానుభూతి ఎక్కువ
రోజులు పని చేయదన్నారు. కాంగ్రెసు
పార్టీ ముఖ్య నేతలు వేసే
ప్రతి అడుగు ఆచితూచి వేయాలని,
వారిని నమ్ముకొని ఎంతోమంది నాయకులు ఉన్నారని చెప్పారు.
కాగా
రాత్రి పగలు వేరు కానట్లే
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అవినీతిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను వేరుగా చూడలేమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
హైదరాబాదులో అన్నారు.
ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. జగన్ అవినీతికి అప్పటి
మంత్రి వర్గానిదే పూర్తి బాధ్యత అన్నారు. వైయస్కు వంతపాడిన
మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఆయన కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment