హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో ఇటీవల చిరంజీవి రాజీనామా
చేసిన తిరుపతి స్థానంలో తమ పార్టీ అభ్యర్థికి
ఫ్యాన్ గుర్తు కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
అయితే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఫ్యాన్
గుర్తును ప్రత్యేకంగా కేటాయించడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఫ్యాన్ గుర్తు
కేటాయించే అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించనుంది.
కాగా
ఇంతకముందు రెండుసార్లు జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు
కేటాయించిన విషయం తెలిసిందే. గత
సంవత్సరం కడప పార్లమెంటు స్థానానికి,
పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో ఆ
పార్టీ తరఫున ఎంపిగా పోటీ
చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి,
ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైయస్
విజయమ్మకు ఫ్యాన్ గుర్తు వచ్చింది.
ఆ తర్వాత ఇటీవల జరిగిన ఏడు
నియోజకవర్గాల ఉప ఎన్నికలలోనూ శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున
పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న
కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కేటాయించారు. పార్టీకి ఒకే గుర్తు ఉండటం
వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుందని నేతలు
భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ పార్టీ గుర్తు
ఫ్యాన్గా దాదాపు ప్రజల్లోకి
వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలో నేతలు
ఫ్యాన్ గుర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment