ప్రపంచంలో
ఉన్న ఫేమస్ క్యాట్ వాక్
మోడల్స్లలో ఆమె పేరు ఎప్పటికీ
ప్రత్యేకం. ఇక ఆమె అందం
గురించి చెప్పాల్సిన పని లేదు. ఇటీవల
2012 సంవత్సరానికి గాను చాలా అందమైన
వ్యక్తిగా 28 సంవత్సరాల వయసు కలిగిన మిరందా
కెర్ని ప్రముఖ ఆస్టేలియా
మ్యాగజైన్ 'హూ' వోటింగ్ ద్వారా
ఎంపిక చేసింది. విక్టోరియా సీక్రెట్ మోడల్గా పేరు
ప్రఖ్యాతులు తెచ్చుకున్న మిరందా కెర్ తన కుమారుడు
ఫ్లిన్తో కలసి హూ
మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చింది.
ఎప్పుడూ
బిజీ జీవితంలో గడిపే ఈ మోడల్
తన భర్తతో ఓర్నాల్డ్ బ్లూమ్తో కలసి ఫ్లిన్కు జన్మనిచ్చింది. మ్యాగజైన్
కవర్ పేజిపై తన కుమారుడితో పాటు
కలసి ఫోజులిచ్చిన మిరందా కెర్ మాట్లాడుతూ గతంలో
నేను రోజుకీ 18 గంటల పాటు కష్టపడేదాన్ని.
కానీ ప్రస్తుతం తల్లిగా నేను నిర్వర్తించాల్సిన కొన్ని
బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువ సమయం మా అబ్బాయి
ప్లిన్తో గడపడానికే కేటాయిస్తున్నానని
మిరందా స్పష్టం చేశారు.
మా ఫ్లిన్ గురించి చెప్పాలంటే అందంగా ఉంటాడు. నాకు ఎటువంటి ఇబ్బందులు
కలిగించినా నేను ఆనందంగా స్వీకరిస్తానని
అన్నారు. మిరందా ఇంగ్లీషు హీరో ఓర్నాల్డ్ బ్లూమ్ని ప్రేమించి పెళ్లి
చేసుకుంది. జనవరి 2011లో బేబి ప్లిన్కి మిరందా జన్మనివ్వడం
జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్విహించిన చాలా అందమైన వ్యక్తి
పోటీల్లో మిరందా కెర్ రెండవ సారి
ఈ టైటిల్ని గెలుచుకుంది. టాప్
40 పోటీదారులలో 17 మంది ఆస్టేలియన్స్ ఉన్నారు.
0 comments:
Post a Comment